ఈనెల 31వ తేదీ నుంచి ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న బృహస్పతి, శని

దీపావళి పండగను ఈనెల 31వ తేదీన జరుపుకోబోతున్నాం. ఆరోజు లక్ష్మీదేవిని పూజించి, ఇల్లంతా దీపాలు వెలిగించి కళకళలాడేలా చేస్తాం. నరకాసుర వధకు గుర్తుగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటాం. ఇటువంటి పవిత్రమైన పండగరోజు కొన్ని గ్రహాలు తిరోగమనం చెందుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. కుంభరాశిలో శనిదేవుడు దీపావళికి ముందే తిరోగమనం చేయనున్నాడు. అలాగే బృహస్పతి కూడా వృషభరాశిలో తిరోగమనం చేయనుండటంవల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
దీపావళి నుంచి ఈ రాశివారికి ఊహించని రీతిలో ధనలాభం కలగనుంది. అలాగే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. విద్యార్థుల కోరికలు తీరడంతోపాటు వారికి అన్నివిధాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా అనేక లాభాలున్నాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

due to jupiter and saturn retrograde three zodiac signs will get more money and healthy life

వృషభ రాశి
ఈ రాశివారికి అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. ప్రధానంగా వీరు విదేశీ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. దీపావళి నుంచి ఆ పనులన్నీ ప్రారంభిస్తారు.

కుంభ రాశి
వ్యాపారస్తులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వారి కెరీర్ అద్భుతంగా పురోగతి చెందుతుంది. ప్రేమలో ఉన్నవారికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. ఎంత కష్టపడితే అంత డబ్బును పొందుతారు. దీపావళి తర్వాత నుంచి వీరు ఏ పని తలపెట్టినా విజయవంతంగా ముగుస్తుంది. అందుకు అదృష్టం తోడుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+