షర్మిలపై నిర్ణయం మార్చుకున్న హైకమాండ్..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ రాజకీయంలో కాంగ్రెస్ వెనుకబడింది. షర్మిల కు పీసీసీ పగ్గాలు అప్పగించిన తరువాత పరిస్థితిలో మార్పు వస్తుందిని పార్టీ నాయకత్వం అంచనా వేసింది. జగన్ ఎన్నికల్లో ఓడటం.. ఎన్డీఏ అధికారంలోకి రావటంతో.. కలిసి వస్తుందని భావించింది. అయితే, దక్షిణాదిలో బలోపేతం పైన ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ కేంద్రంగా కొత్త నిర్ణయాలకు సమాయత్తం అవుతోంది.
కాంగ్రెస్ నాయకత్వం దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కార్యాచరణ అమలు చేస్తోంది. కేరళలో విజయం.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తరువాత ఇక ఏపీ లో భవిష్యత్ ఏంటనే చర్చ మొదలైంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏపీ పైన తాజాగా కర్ణాటక, తెలంగాణ సీఎం డీకే శివకుమార్.. రేవంత్ తోనూ గతంలోనే చర్చలు చేసారు. ఇద్దరూ తరచుగా ఏపీలో పర్యటించాలని సూచించారు. రేవంత్ సైతం ఏపీలో జరిగిన పార్టీ సమావేశాల్లోనూ హాజరు అయ్యారు.

కాగా.. ఏపీలో 2024 ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా రష్మిలకు పార్టీ ఏపీ పగ్గాలు అప్పగిం చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వచ్చినా.. సీట్లు రాలేదు. ఇక, ఈ రెండేళ్ల కాలంలో షర్మిల నుంచి ఆశించిన స్థాయిలో పని తీరు కనిపించటం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం మీద గురి పెట్టాల్సిన సమయంలో.. తన అన్న జగన్ పైనే ఎక్కువగా విమర్శలు చేయటం పార్టీకి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని హైకమాండ్ వద్ద పార్టీ నేతలే వ్యక్తం చేసారు.
ఇదే సమయంలో షర్మిల పార్టీ నేతల సమన్వయంలోనూ సరిగ్గా వ్యవహరించటం లేదని కొందరు నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసారు. కొద్ది రోజుల క్రితం భర్తీ చేసిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి షర్మిల కు ఇస్తారని.. కర్ణాటక నుంచి షర్మిల రాజ్యసభకు వెళ్లేలా తొలుత ప్లాన్ చేసారు. అయితే, తరువాత మారిన పరిణామాలతో షర్మిల కు సీటు దక్కలేదు. ఇక.. ఇప్పుడు ఏపీలో మాత్రమే అసలు పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో పీసీసీ చీఫ్ మార్పు పైన మళ్లీ చర్చ మొదలు అయిందని పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది.
బీసీ మహిళకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో షర్మిల కు పార్టీ జాతీయ కార్యవర్గంలో అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తి కావడంతోనే ఏపీ మీద కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఫోకస్ చేస్తుందని.. ఆ సమయంలో రాష్ట్ర నేతలతో చర్చల తరువాత పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications