82 ఏళ్ల తర్వాత ఈ రాశుల పంట పండింది.. శక్తివంతమైన యోగం
ఈ ఏడాది దీపావళిని ఈనెల 31న కొందరు జరుపుకుంటున్నారు. మరికొందరు నవంబరు 1న జరుపుకుంటున్నారు. ఆరోజు ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. వాస్తవానికి ధన త్రయోదశి నుంచి అమావాస్య వరకు మూడు రోజులపాటు దీపావళి పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, నరకాసురుడిని సంహరించి సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. టపాసులు కాల్చుకుంటారు. ప్రతి ఒక్కరు దీపాలు వెలిగిస్తారు.
నవంబరు ఒకటోతేదీన సూర్యోదయం వేళ అమావాస్య వస్తుంది. అందుకే చాలామంది ఆరోజు లక్ష్మీదేవిని పూజించుకుంటారు. ఆరోజు ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ రాజయోగంవల్ల అఖండ ధనలాభం కలుగుతోంది. ఏయే రాశులవారికి ఏవిధంగా లాభం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.

తులా రాశి
గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇదే సమయంలో ఆకస్మిక ధనలాభం ఉంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి కలిసివస్తుంది. సోదరులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయి. కష్టానికి తగినట్లుగా ఫలితం దక్కుతుంది.
మిథునరాశి
ఎప్పటి నుంచో కలలు కంటున్న కొల్ల ఇంటి కల సాకారం అవుతుంది. న్యాయపరమైన విషయాలకు సంబంధించి కోర్టుల్లో విజయం దక్కుతుంది. భార్య తరఫు నుంచి భర్తకు ఆస్తులు కలిసివస్తాయి. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. కొద్ది సమయంలోనే విజయవంతమైన వ్యక్తులుగా ఉద్యోగులు నిలుస్తారు. అందుకు వారికి పై అధికారుల నుంచి మద్దతు లభించి మంచి పేరు వస్తుంది.
మీనరాశి
విందులు, వినోదాల్లో ఎక్కువగా సమయం గడుపుతారు. పెళ్లి కానివారికి సంబంధాలు కుదురుతాయి. లక్ష్మీనారాయణ యోగం వల్ల కలిగే ప్రభావం వీరికి వివాహ యోగాన్ని కల్పిస్తుంది. ఆర్థికంగా గతంలోకంటే ప్రస్తుతానికి బలోపేతమవుతారు. సంపాదించిన డబ్బును పొదుపు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications