వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యంపై వాస్తు ప్రభావం; ఈ వాస్తు టిప్స్ తో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత!!

|
Google Oneindia TeluguNews

మీ మానసిక మరియు శారీరక శ్రేయస్సులో మీ ఇంటి వాస్తు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరికాని వాస్తు ఇంటి శ్రేయస్సును ప్రభావితం చేయడమే కాదు, మీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నివసించే వాళ్లు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాలని, ఆరోగ్య విషయంలో కొన్ని వాస్తు నియమాలను సూచిస్తున్నారు. ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండటానికి ఈ వాస్తు చిట్కాలను ప్రయత్నించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్యం వైపు చూస్తూ యోగా మరియు ధ్యానం చెయ్యటం మంచిది

ఈశాన్యం వైపు చూస్తూ యోగా మరియు ధ్యానం చెయ్యటం మంచిది

ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు తూర్పు దిక్కున ఈశాన్యం వైపు చూస్తూ యోగా మరియు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం విషయానికి వస్తే సానుకూల ఫలితాలు పొందవచ్చునని సూచిస్తున్నారు. ఉదయం సూర్య కిరణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ఈశాన్యం వైపు చూస్తూ యోగా చేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

లేత రంగులు వాడటం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

లేత రంగులు వాడటం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత

ఈశాన్య దిశలో పూజ చేయడం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈశాన్య దిశలో కూర్చుని పూజ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఇంట్లో లేత రంగులు ఉపయోగించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. డార్క్ కలర్స్ కొన్నిసార్లు ఆరోగ్యానికి హాని చేస్తాయని, మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఉపయోగించే ఫర్నీచర్, కర్టెన్లు, బెడ్‌షీట్లు, కుషన్లు మొదలైన వాటికి లేత రంగులు వాడాలి.ఇంట్లో ముదురు రంగులకు దూరంగా ఉంటే మేలు జరుగుతుందని చెబుతున్నారు

వాయువ్య దిశలో కుటుంబ పెద్ద నవ్వుతున్న ఫోటో పెడితే మంచిది

వాయువ్య దిశలో కుటుంబ పెద్ద నవ్వుతున్న ఫోటో పెడితే మంచిది

కుటుంబం యొక్క మంచి ఆరోగ్యం కోసం, వాయువ్య దిశలో ఇంటి పెద్ద లేదా మొత్తం కుటుంబం యొక్క నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ పెద్ద నవ్వుతూ ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే, ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తి ఇంట్లో చికిత్స పొందుతున్నట్లయితే, వారి మందులను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. కోలుకుంటున్న వ్యక్తిని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో గదిలో ఉంచడం వల్ల వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లో పాత, పనికిరాని వస్తువులు ఉండకూడదు

ఇంట్లో పాత, పనికిరాని వస్తువులు ఉండకూడదు


పనికిరాని వస్తువులను ఇంటి నుండి పార వెయ్యాలని చెబుతున్నారు. వస్తువులకు మరమ్మతులు అవసరమైతే, వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి లేదా సరిచేయాలని కానీ పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదని చెబుతున్నారు. ఇంట్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో పాత వస్తువులను జమ చేసి పెట్టడం, చెత్తాచెదారాన్ని ఉంచడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

తలుపులు, కిటికీలు శబ్దం చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం

తలుపులు, కిటికీలు శబ్దం చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం


తలుపులు మరియు కిటికీలకు నూనె రాసి ఉండాలని సూచిస్తున్నారు. తద్వారా అవి తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు ఎటువంటి శబ్దం చేయవు. ప్రధాన ద్వారం తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు కూడా శబ్దం ఉండకూడదు. అలా తలుపులు కిర్రు మని శబ్దం చేస్తే ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

English summary
Vastu has influence on health. Vastu tips such as meditation facing North-East, worshiping North-East direction, using light colors in the house will give health along with mental peace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X