వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Famous Durga Temples: ఈ ప్రసిద్ధ దుర్గామాత ఆలయాలలో కోరికలు నెరవేరుతాయి, ఎలా చేరుకోవాలంటే!!

|
Google Oneindia TeluguNews

దుర్గా దేవిని అత్యంత భక్తిభావంతో పూజించే దసరా శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే దుర్గ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈరోజు మూడో రోజు. తొమ్మిది రోజులపాటు దుర్గా దేవిని భక్తులు వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ పండుగను భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు అమ్మవారి ఆలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల విశేషమేమిటి ? ఆలయాలకు ఏవిధంగా చేరుకోవాలి వంటి అనేక అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.

కాళికా ఆలయం .. వైభవంగా ఉత్సవాలు

కాళికా ఆలయం .. వైభవంగా ఉత్సవాలు

దేశ రాజధాని ఢిల్లీలో దుర్గామాత కు సంబంధించి పురాతన ఆలయాలు ఉన్నాయి. అటువంటి పురాతన ఆలయాలలో కాళికా ఆలయం ఒకటి. ఈ ఆలయం దుర్గా దేవి యొక్క కాళీ అవతారానికి అంకితంచేయబడిన ఆలయం. అమ్మవారి ఇక్కడ కాళికా దేవి అవతారం లో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి సమయంలో ఈ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి పోటెత్తిన నవరాత్రులలో అమ్మవారిని పూజించుకుంటారు. ఇక ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే దేశ రాజధాని ఢిల్లీలోని కాళికా మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఆలయం ఉంది.

ఝండేవాలన్ ఆలయం.. ఆదిశక్తిగా అమ్మవారు.. కోరికలు తీర్చే మహిమాన్విత

ఝండేవాలన్ ఆలయం.. ఆదిశక్తిగా అమ్మవారు.. కోరికలు తీర్చే మహిమాన్విత

ఢిల్లీలోనే దుర్గా మాత కి సంబంధించిన మహిమాన్విత మరో ఆలయం ఝండేవాలన్ ఆలయం . ఈ పురాతన ఆలయం ఢిల్లీలోని ఝండేవాలన్ రోడ్‌లో ఉంది. ఏడాది పొడవునా ప్రజలు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం వస్తుంటారు. అయితే నవరాత్రుల సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఆదిశక్తికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, కోరికలు కోరుకుంటే, ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతారు. ప్రస్తుతం దుర్గా నవరాత్రుల ఉత్సవాల కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తులు విశేషంగా ఝండేవాలన్ ఆలయానికి చేరుకుని అమ్మవారిని పూజిస్తున్నారు. ఇక ఈ ఆలయానికి ఢిల్లీ లోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయానికి వెళ్లడానికి ఝండేవాలన్ మెట్రో రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడనుండి కూతవేటు దూరంలో ఈ ఆలయం ఉంటుంది.

ఛతర్పూర్ ఆలయం.. కాత్యాయనిగా అమ్మవారు.. అతిపెద్ద ఆలయంలో వేడుకలు

ఛతర్పూర్ ఆలయం.. కాత్యాయనిగా అమ్మవారు.. అతిపెద్ద ఆలయంలో వేడుకలు


ఇక దేశ రాజధాని ఢిల్లీలో అమ్మవారి కి సంబంధించి చూడదగిన ఆలయాలలో మరొక ఆలయం ఛతర్పూర్ ఆలయం. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉంటుంది. అందంగా నిర్మించబడిన ఈ ఆలయం భారతదేశంలో రెండవ అతిపెద్ద సముదాయాన్ని కలిగి ఉంది. ఇక్కడ దసరా శరన్నవరాత్రులు సందర్భంగా జాగరణ కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత కాత్యాయని. ఇక్కడ కాత్యాయని దేవిని దసరా ఉత్సవాల సమయంలో భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. ఛతర్పూర్ ఆలయానికి చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో నుండి సమీప మెట్రో స్టేషన్ ఛతర్పూర్ వద్ద దిగాలి. ఈ ఆలయం ఛతర్‌పూర్ మెట్రో స్టేషన్ నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి వెళ్లాలనుకునే వారు ఆటోలో లేదా 10 నిమిషాలు నడిచి ఆలయానికి చేరుకోవచ్చు.

గుహ ఆలయం.. మాతా వైష్ణోదేవి అమ్మవారు.. అత్యంత శక్తి దాయిని

గుహ ఆలయం.. మాతా వైష్ణోదేవి అమ్మవారు.. అత్యంత శక్తి దాయిని


ఇక ఢిల్లీలో మరొక పురాతన దేవాలయాలలో గుహ దేవాలయం కూడా ఒకటి. మాతా వైష్ణో దేవికి అంకితం చేయబడిన పురాతన దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఉంది. ఆలయం లోపల ఒక పెద్ద గుహ ఉంది, దాని లోపల నీరు కూడా నిండి ఉంటుంది. ఈ ఆలయంలో మీరు వైష్ణో దేవి దర్శనం పొందుతారు. చిన్న గుహలో కాత్యాయని, చింతపూర్ణి మరియు జ్వాలా దేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని ప్రస్తుతం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అందంగా అలంకరించారు. ఈ గుహాలయాన్ని ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం ప్రీత్ విహార్‌లో ఉంది . దీనికి దగ్గరగా మెట్రో ప్రీత్ విహార్ (బ్లూ లైన్) ఉంది. ఈ ఆలయం మెట్రో నుండి 5 నిమిషాల నడక దూరంలో ఉంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
The wishes of devotees can be fulfilled by visiting the famous Goddess Durga temples like Kalaka Temple, Jhandewalan Temple, Guha Temple, Chhatarpur Temple in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X