నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 29నాడు శుభయోగం.. వీరికి జాక్ పాట్!!
2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. ఈ సంవత్సరం లీప్ ఇయర్ కావడంతో 29వ తేదీ కూడా ఉంటుంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. అయితే ఈ సంవత్సరం వచ్చిన లీప్ డే ఫిబ్రవరి 29 ఒక అపురూపమైన శుభ యోగాన్ని తీసుకువస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఫిబ్రవరి 29వ తేదీన పుట్టిన వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
ఫిబ్రవరి 29వ తేదీ రోజు గ్రహాలు మరియు నక్షత్రాల చమత్కార అమరిక ఒక ప్రత్యేకమైన విశ్వ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం గ్రహాలు మరియు రాశుల స్థానాలు మన జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తాయి. ఫిబ్రవరి 29వ తేదీన గ్రహాలు మరియు రాశుల అమరిక మన జీవితం పైన కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

ఫిబ్రవరి 29వ తేదీన కుంభ రాశిలో సూర్యుడు, శని, బుధుడు కలవడం ఒక ఆకర్షణీయమైన శుభ యోగానికి కారణమవుతుంది. కుజ గ్రహం, శుక్రుడు మకర రాశిలో సమలేఖనం అవుతారు. ఇక బృహస్పతి కుజ గ్రహానికి చెందిన రాశిలో ఉంటాడు. ఇక ఈ పరిణామాలతో ఒక ఖగోళ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. దీంతో ఫిబ్రవరి 29వ తేదీన పుట్టిన వారికి అద్భుతమైన యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది.
ఇక జన్మ చార్టులలో శని సానుకూల స్థానంలో ఉన్నవారు పంచ మహాపురుష రాజయోగాన్ని అనుభవించవచ్చు. ఇది శుభ మరియు శక్తివంతమైన గ్రహాల కలయికను సూచిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీన వృషభం, సింహం, వృశ్చికం లేదా కుంభ రాశిలో జన్మించిన వారికి శష రాజయోగం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది.
అంతేకాదు మేషం, కర్కాటకం, తుల, మకర రాశికి చెందిన వారికి రుచక యోగం కారణంగా సానుకూల ప్రభావాలను తెస్తుంది. ఇక ఫిబ్రవరి 29 2024లో పుట్టే పిల్లలు శని మరియు అంగారకుడు ప్రత్యేక ప్రభావంతో జన్మిస్తారని, వారు శ్రేయస్సును, ఆనందాన్ని తమ జీవితంలో పొందుతారని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications