ఈ నెల 15వ తేదీ నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం

ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరిస్తున్న నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకుంటుంటాడు. వైదిక జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ఈ నెల 15 తేదీన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల ఐదు రాశులకు అదృష్టం పట్టుకుంటుంది. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.

కుంభ రాశి
సమాజంలో హోదా పెరుగుతుంది. నలుగురి నుంచి గౌరవం కలుగుతుంది. సమాజ సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులన్నీ ఇప్పుడు ప్రారంభమై సజావుగా పూర్తవుతాయి.

five zodiac signs will get amazing financial benefits due to sun will enter taurus from may 15th

మీన రాశి
అన్ని పనుల్లో సానుకూలంగా ఆలోచిస్తారు. దగ్గరి ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. వృత్తిపరంగా, ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. వీరికి అన్నీ లాభాలే కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

సింహ రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వ్యాపారాలు, వృత్తి పనులు కలిసిరావడంవల్ల ఆదాయం పెరిగి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగస్తుల్లో కొందరికి పదోన్నతులున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కొందరు ఉద్యోగులకు డబ్బు సంపాదనకు అవకాశాలు వస్తాయి. వాటిని తిరస్కరించాలి. అవి లంచం రూపంలో వస్తాయి. తిరస్కరించకపోతే చిక్కుల్లో పడతారు.

కన్యా రాశి
ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నచోటే మంచి లాభాలుండే కాంట్రాక్టు మీ సొంతమవుతుంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

వృశ్చిక రాశి
కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకుంటుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి మరోచోట ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు దొరుకుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+