శనిదేవుడి తిరోగమనంతో కోటీశ్వరులవుతున్న రాశులు వీరే
మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు శనిదేవుడు. నవగ్రహాల్లో కీలక గ్రహమైన శని తన రాశిని మార్చుకునేందుకు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. అత్యంత నెమ్మదిగా కదులుతాడు. శని తలుచుకుంటే ఎంతో మంచిని చేస్తాడు. కానీ అందరూ శని అంటే భయపడతారుకానీ జీవిత పాఠాలు నేర్పేది ఆయనే. రానున్న 138 రోజులు శని తిరోగమన దిశలో సంచారం చేయనున్నాడు.
తిరిగి నవంబరు 18వ తేదీన సాధారణంగా సంచారం చేస్తాడు. శనిదేవుడు మీనరాశిలో తిరోగమనం చేయనుండటంవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుంది? వారి అదృష్టం ఎలా మారనుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకరకంగా చెప్పాలంటే కొన్ని రాశులవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాబోతున్నారు.

మీన రాశి
కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇబ్బందులన్నీ తీరిపోతాయి. శనిదేవుడి వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శనిదేవుడిని పూజించడంవల్ల అనేక లాభాలను పొందుతారు.
మేష రాశి
ప్రస్తుతం వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ముగింపు దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయగలుగుతారు. ఒకరకంగా ఈ రాశివారు కోటీశ్వరులు కాబోతున్నారు.
సింహ రాశి
శని దేవుడి తిరోగమనం ఈ రాశివారికి పంట పండిస్తోంది. దశ, దిశ మారి ఆర్థికంగా స్థిరపడతారు. కొంతకాలం నుంచి ఈ రాశివారు పడుతున్న కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకొని విజయం దిశగా పయనిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధించడంతోపాటు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకొని సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు.
కుంభ రాశి
ఒక నిర్ణయం తీసుకునేముందు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలన్నీ మంచి ఫలితాలనిస్తాయి. దీనివల్ల కోటీశ్వరులుగా మారతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు దొరుకుతాయి. సంపద భారీగా పెరిగి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications