ఈ నెల 22 నుంచి ఈ రాశుల సుడి తిరిగింది
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 21వ తేదీకి రాజుగా వ్యవహరించాడు. అలాగే దేవతల గురువైన బృహస్పతి చంద్రుడి సొంత రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల సమసప్తక యగం, గ్రహాల సంచారంతో గజకేసరి రాజయోగం, చంద్రుడు, కుజుడి సంయోగంతో ధనలక్ష్మీ రాజయోగం ఏర్పడ్డాయి. అందుకే ఈ నెల 21వ తేదీ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వీటి ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి అద్భుత లాభాలను, విపరీతమైన ప్రయోజనాలను అందుకోనున్న రాశుల గురించి జ్యోతిష్య పండితులు తెలియజేశారు.
కన్యా రాశి
కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంతోషగా గడుపుతారు. క్లిష్టమైన పనులను కూడా చాలా సులభంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. పోటీపరీక్షలు రాసేవారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారి సమస్యలు పరిష్కారమవుతాయి. కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయం ఈ రాశివారికి మంచి లాభాలను అందిస్తుందని, ప్రయోజనాలను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి
క్యాటరింగ్ రంగంలో ఉన్నవారు ఈ సమయంలో ఎక్కువగా సంపాదించుకుంటారు. ఎన్నో రకాల లాభాలను పొందుతారు. స్నేహితులతో, బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మధురంగా ఉండే క్షణాలను సొంతం చేసుకుంటారు.
వృషభ రాశి
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. కొత్తగా దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశివారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు వారి కార్యాలయాల్లో జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితంలో సంతోషాన్ని పొందుతారు.
కర్కాటక రాశి
సామాజిక రంగాల్లో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుత గౌరవాభిమానాలు దక్కుతాయి. వివాదాలన్నీ తొలగిపోతాయి. కొన్ని పనుల్లో విజయాలు అందుకుంటారు. మరికొన్ని పనుల్లో బిజీ అవుతారు. అదృష్టం తోడుంటుంది. అన్మదమ్ములు ఒకర్నొకరు సహకరించుకుంటారు. వీరి సహాయంతో ఈ రాశివారు మంచి ప్రయోజనాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications