ఆగస్టులో ఈ రాశులకు కనీ వినీ ఎరగని రీతిలో సంపద

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అత్యంత కీలకమైన గ్రహం. దేవతలకు గురువు. జ్ఞానాన్ని, వివాహాన్ని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. జీవితాన్ని ఆధ్యాత్మికతవైపు పయనింపచేసి జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. ఆగస్టు నెలలో గురువు రెండుసార్లు నక్షత్రాలను మారుస్తున్నాడు. 13వ తేదీన పునర్వసు నక్షత్రం మొదటి పాదంలోకి, 30వ తేదీన పునర్వసు రెండో పాదంలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల నాలుగు రాశులవారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. వ్యక్తిగత జీవితంలో శాంతి నెలకుంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వృత్తి పరంగా కోరుకున్న రీతిలోనే విజయాన్ని అందుకుంటారు.

four zodiac signs will get all financial benefits and good health due to Jupiter two times transit in punarvasu nakshatram

ధనుస్సు రాశి
ఉద్యోగస్థులు వారి కార్యాలయాల్లో మంచి పనితీరు కనపరిచి పై అధికారుల దగ్గర మంచిపేరు తెచ్చుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడులను ఈ సమయంలో అందుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అన్ని పనుల్లో చాలా సులువుగా విజయం సాధిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు సూర్యుడిని పూజించాలి. ఆత్మవిశ్వాసంతో పనులు చేయడంవల్ల కార్యాలయంలో పదోన్నతి కలుగుతుంది.

వృషభ రాశి
సమాజంలో హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. బృహస్పతి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. కుటుంబంలోనే ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. కొత్తగా ఆదాయం పొందేందుకు మార్గాలు దొరుకుతాయి. సంపద పెరుగుతుంది. వచ్చిన డబ్బును ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడంతోపాటు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

సింహ రాశి
జీవితం సంతోషంగా సాగుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తీరిపోతాయి. ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. సంపద పెరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి డబ్బును దుబారాగా ఖర్చు చేయొద్దు. అవసరపడతాయి. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+