2025లో ఈ రాశులు ఏనుగు కుంభస్థలాన్ని బద్ధలు కొడుతున్నారు
కొత్త సంవత్సరంలో న్యాయదేవత అయిన శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి నీడ గ్రహమైన రాహువు ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం రాహువు, కేతువు తిరోగమన దిశలో ఉంటాయి. మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీన్నివల్ల అన్ని రాశి చక్ర గుర్తులు ప్రభావితమైనప్పటికీ కొన్ని రాశులవారికి మాత్రం రాహువు విశేషమైన రీతిలో, ఊహించని విధంగా ప్రయోజనాలను కల్పించబోతున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనస్సు రాశి
కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు. డబ్బు సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విద్యార్థులు మంచి మంచి విజయాలను అందుకుంటారు. వ్యాపారస్తులు భారీగా ఆర్డర్లను పొందడంతోపాటు ఆర్థికంగా మంచి డబ్బును కళ్ల చూస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు సామాజిక సేవకు సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా మంచిగా స్థిరపడతారు.

వృషభ రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కొత్త సంవత్సరంలో ఆసక్తి పెంచుకుంటారు. కుటుంబ జీవితం మాత్రం చాలా సంతోషకరంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేదంటే నష్టపోతారు. కొత్త సంవత్సరంలో రాహువు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కొత్త వ్యాపారం కోసం వేసుకున్న ప్రణాళికలన్నీ సజావుగా అమలయ్యేందుకు తోడ్పడతాడు. అన్నివిధాలుగా వ్యాపారంలో కలిసివస్తుంది. వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటారు.
కుంభ రాశి
అనేక ఆదాయ మార్గాలు ఈ రాశివారికి దొరుకుతాయి. వ్యాపారం చేసేవారికి కలిసివస్తుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచన చేస్తుంటారు. కొత్త సంవత్సరంలో పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కన్య రాశి
ఆర్థిక పరిస్థితిలో మాత్రం ఊహించనిరీతిలో పెరుగుదల కనపడుతుంది. రాహువు సంచారంవల్లే ఇలా వీరికి కలిసిరానుంది. డబ్బు సంపాదనకు అవసరమైన అనేక మార్గాలు దొరుకుతాయి. పెళ్లయినవారి జీవితం సంతోషంగా సాగుతుంది. ఉద్యోగులు తాము పనిచేసే కార్యాలయాల్లో పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు ఉన్న మానసిక ఆందోళన తగ్గిపోతుంది. రాహువు సంచారంవల్ల పెద్ద పెద్ద లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు.












Click it and Unblock the Notifications