శక్తివంతమైన త్రివేణి రాజయోగం... ఈ రాశులకు అఖండ ధనయోగం
ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. ఆరోజు ఎంతో పవిత్రమైన రోజు. నదీ స్నానాలు, జపాలు చేయడంవల్ల పాపాలు తొలగిపోతాయి. అమావాస్యరోజే ఎంతో శక్తివంతమైన త్రివేణి యోగం ఏర్పడబోతోంది. మౌని అమావాస్య రోజు బుధుడు, చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో కలుస్తున్నారు. దీనివల్ల త్రివేణి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇది ఎంతో శక్తివంతమైన యోగం. చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ ప్రభావం ఏయే రాశులపై పడుతుంది? ఏయే రాశులకు కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఈ రాశివారు కూడా ఆధ్యాత్మిక జీవితంవైపు ప్రయాణం ప్రారంభిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఒక్కోసారి దూరప్రయాణం కూడా చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులందరికీ మేలు కలుగుతుంది. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం.. రెండూ బాగుంటాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో నోరును అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల మేలు కలుగుతుంది.

కన్యారాశి
పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారు. పెళ్లికానివారికి వివాహం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా వేధిస్తున్న సమస్యలన్నీ దూరమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు. మంచి అదృష్టజాతకులవుతారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యంపై ఆందోళన తగ్గిపోతుంది.
మకర రాశి
వ్యాపారస్తులకు ఈ సమయంలో అద్బుతమైన లాభాలు వస్తాయి. భారీ ఆర్డర్లు పొందుతారు. కొత్త వ్యాపారాలపై పెట్టుబడి పెడతారు. జీవితం మొత్తం ఇక్కడి నుంచి సానుకూల దృక్పథంతో ప్రారంభమవుతుంది. జీవితంలో సంతోషకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు వీరి జీవితం ఒక ఎత్తు కాగా, ఇకనుంచి మరో ఎత్తు కానుంది. త్రివేణి యోగంవల్ల ఈ రాశివారు ఆర్థికంగా బలవంతులవుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపు పొందుతారు.
వృషభ రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తారు. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెండింగ్ పనులను తిరిగి ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications