ఈ నెల 17 నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా ప్లాటినం అవుతుంది

గ్రహాలకు అధిపతి సూర్యుడు. ఈ నెల 17వ తేదీన సింహరాశిలోకి సూర్య భగవానుడు సంచారం చేయబోతున్నాడు. అప్పటికే ఆ రాశిలో కేతువు సంచారం చేస్తుంటుంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత సూర్యుడు-కేతువు సంయోగం జరగనుండటంతో 4 రాశులవారికి బాగా కలిసిరానుంది. వీరు మంచి లాభాలను కూడా పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.

సింహరాశి
మానిసికంగా ఉన్న లోటు తొలగిపోతుంది. ప్రతి పనిలో విజయం పలకరిస్తుంది. ఉద్యగస్తులకు మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బలంగా ఉంటారు. అనేక లాభాలున్నాయి. సంపద పెరుగుతుంది. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఎప్పటినుంచో అనుకుంటున్న పనులు కూడా ఈ సమయంలోనే పూర్తిచేస్తారు.

four zodiac signs will get huge money and big success their life due to sun will enter leo

తులా రాశి
గతంలో చేసిన పనుల్లో అడ్డంకులు ఎదురై ఉంటే ఈ సమయంలో అవి తొలగిపోతాయి. డబ్బు సంపాదనకు అదనపు ఆదాయ వనరులు దొరుకుతాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఉద్యోగస్థులకు వారి సీనియర్ ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి సాధించి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడుల కోసం చూస్తుంటారు. కుటుంబ సమస్యలన్నీ తీరిపోయి అందరూ సంతోషంగా ఉంటారు.

మకర రాశి
వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్థులకు కార్యాలయాల్లో పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వేతనం పెరిగి పదోన్నతి వస్తుంది. వ్యాపారాల్లో ఉన్న ఇబ్బందులన్నీ ఈ సమయంలోనే తొలగిపోతాయి. అద్భుతమైన ప్రణాళికలు అల్లుకొని జీవితంలో వీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా విద్య పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

మేష రాశి
ప్రేమ జీవితంలో ఉన్నవారు ఇరువైపులా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి గొప్ప అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే అతి పెద్ద విజయాలను నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆమోదం లభించడంతో అన్ని పనులు సజావుగా పూర్తిచేస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి కోరిక నెరవేరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+