16న బుధాదిత్య రాజయోగం... ఈ రాశుల ఇంట్లో ధనలక్ష్మి శివ తాండవం
ఖగోళంలో గ్రహాలు నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి.. అలాగే మరికొన్ని అశుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈనెల 16వ తేదీన సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో బుధుడు సంచారం చేస్తుంటాడు. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారికి బాగా కలిసివచ్చి కుబేరులవుతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.
వృశ్చికం
ఈ రాశివారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయం పెరగడంతోపాటు అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఈ రాశివారికి అదృష్టం అధికంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తిచేస్తారు. సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు. పనిచేసేచోట కూడా అంతేపేరు వస్తుంది.

తుల
ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట పై అధికారుల నుంచి మద్దతు లభించడంతోపాటు తోటి ఉద్యోగుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతాయి. కొన్ని మార్గాలద్వారా వీరికి డబ్బులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ సమయం మొత్తం ఈ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వెనుతిరిగి చూసే అవకాశం రాదు.
మకరం
ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. వీరు చేసే పనులన్నీ విజయం సాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ ఇప్పుడు వస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.
కుంభం
వ్యాపారస్తులు అభివృద్ధి చెందుతారు. వ్యాపారం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. కుటుంబంలో ఉండే చిన్న చిన్న మనస్పర్థలన్నీ ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి. భూమికి సంబంధించిన వివాదాలు కూడా సులువుగా ఈ సమయంలోనే పరిష్కారమవడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications