ఈ రాశులవారికి మహారాజ యోగం పట్టుకుంటోంది
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్ స్కిల్స్ కు, వ్యాపారానికి కారకుడు. జ్యోతిష్యం ప్రకారం బుధుడి మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. జాతకంలో ఆయన శుభప్రదమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ జాతకం ఆర్థికంగా పురోగతి చెందుతుంది. ప్రస్తుతం బుధుడి మహాదశ ఏయే రాశులకు వరంలా మారింది? ఎటువంటి ప్రయోజనాలను కల్పించనుందనే విషయాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వేతనాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి లేదంటే విదేశాలకు వెళతారు. సమాజంలో హోదాతోపాటు సంపద పెరుగుతుంది. మంచి ఆరోగ్యంతో ఉంటారు. పేరు ప్రఖ్యాతులు ఉన్నతంగా ఉంటాయి.

తులా రాశి
సంప్రదింపులు, సౌందర్యం ద్వారా వీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీడియా, న్యాయ, రాజకీయ, ప్రజా సంబంధాలకు సంబంధించిన రంగాల్లో ప్రత్యేకంగా విజయాలను అందుకుంటారు. బుధుడి రాశితో మంచి సంబంధాలుంటాయి.
వృషభ రాశి
ఈ రాశికి శుక్రుడు అధిపతి. కళలు, సంగీతం, ఫ్యాషన్, ఫైనాన్స్ రంగాల్లో వీరు రాణిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని, వైభవాన్ని, బౌతిక సుఖాలను పొందుతారు. శుక్రుడు, బుధుడు స్నేహంగా ఉండటమే దీనికి కారణం.
మిథున రాశి
మీకున్న తెలివితేటలు, వాక్చాతుర్యం వల్ల సమాజంలో పేరు తెచ్చుకుంటారు. గౌరవం కలుగుతుంది. రచన, మీడియా, వ్యాపార నిర్వహణలో అభివృద్ధి చెందుతారు. మిథున రాశి బుధుడికి సొంత రాశి. అందుకే వారికి బుధుడి మహాదశ చాలా పవిత్రమైంది.












Click it and Unblock the Notifications