2025లొ ఈ రాశులకు సంపద ఇవ్వకపోతే పేరు మార్చుకుంటానంటున్న బృహస్పతి
మరో రెండు నెలలు ముగియగానే కొత్త ఏడాది రాబోతోంది. అలాగే జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి తన రాశిని మార్చనున్నాడు. సంపదకు, జ్ఞానానికి కారకుడయ్యే గురుడు 2025లో మూడు సార్లు తన రాశిని మార్చుకుంటుంది. వచ్చే ఏడాది మే 14వ తేదీ వరకు వృషభరాశిలోనే ఉంటాడు. అనంతరం మిథునరాశిలోకి వెళతాడు. తిరిగి అక్టోబరు 18వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. తిరిగి డిసెంబరు 5న మిథునరాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల నాలుగు రాశులవారికి ఆదాయం నాలుగు రెట్లు పెరగబోతోంది. దేవగురువైన బృహస్పతి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడతారో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి గురువు రాశి మార్పు ఎంతో కలిసివస్తుంది. విద్యలో మంచి పురోగతి సాధించడంతోపాటు పోటీపరీక్షలకు హాజరయ్యేవారు రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది.

మిథున రాశి
దాంపత్య జీవితం ఈ రాశివారికి చాలా బాగుంటుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. 2025లో ఇప్పుడున్న పరిస్థితికంటే ఆర్థికంగా మరింత బలపడతారు. కొత్త సంవత్సరం మాత్రం మిథునరాశివారికి బాగా కలిసివస్తుంది.
సింహ రాశి
కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. జీవితంలో సంపదను పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. శుభకార్యాలకు డబ్బు ఖర్చవుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగుంటుంది. దూర ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక వాతావరణంపై దృష్టి మళ్లుతుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
తులా రాశి
ఈ రాశివారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కోర్టుల్లో కొద్దికాలం నుంచి పెండింగ్ లో ఉన్న కేసుల్లో తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. గతంలో ఉన్న కేసులు ఈ సమయంలో పరిష్కారమవుతాయి.












Click it and Unblock the Notifications