ఏలినాటి శని నుంచి ఈ రాశులకు విముక్తి... అన్నీ రాజభోగాలే
నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన ఎంతో నీతిమంతుడు. నీతిగా, నిజాయితీగా ఉండేవారినే ఎక్కువగా ఇష్టపడతాడు. ఆయన అనుగ్రహం కలిగిందా జీవితంలో కోటీశ్వరులైపోతారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఎందుకంటే గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని. మార్చిలో శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశిస్తుండటంతో కొన్ని రాశులవారికి ఏడున్నర సంవత్సరాల శని సడేసతి నుంచి పూర్తిగా విముక్తులై రాజభోగాలను అనుభవిస్తారు. ఏయే రాశులకు విముక్తి కలుగుతుంది? వారికి తర్వాత ఎలా కలిసివస్తుందనే విషయాలను కూలంకుషంగా తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి శనిదేవుడి దశ ముగిసే సమయం ఇది. దీంతో కొన్ని సంవత్సరాలుగా వీరు పడుతున్న ఇబ్బందులు, బాధలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో అద్భుతంగా పుంజుకుంటారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అప్పటివరకు ఉన్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడంతోపాటు ఆదాయం కూడా పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు. శనిదేవుడు పోతూపోతూ వీరికి మంచి ప్రయోజనాలను కల్పించి వెళతాడు. వాటిని ఉపయోగించుకుంటే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

మేషరాశి
వీరికి పనుల్లో అవాంతరాలు ఎదురవుతంటాయి. కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే శనిదేవుడు వీరి కర్మలను బట్టి ఫలితాలిస్తాడు. కొత్త పనులు ఏవైనా ఉంటే వాటిని ప్రారంభించకుండా ఉండటమే ఉత్తమం. శనిదేవుడు పోతూపోతూ మంచి ప్రయోజనాలను కలిగించిపోతాడు. వాటిని ఉపయోగించుకోవడం అనేది రాశులవారిపై ఆధారపడివుంటుంది.
మీనరాశి
ఈ సంవత్సరంలో శనిదేవుడి అశుభ దృష్టి మొత్తం మీనరాశిపై ఉంటుంది. దీనివల్ల వీరు కష్టాలు పడక తప్పదు. దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారస్తులకు నష్టాలున్నాయి. కొత్త వ్యాపారాలుకానీ, కొత్త పనులు కానీ ప్రారంభించకుండా ఉండటమే ఉత్తమం. ఉద్యోగులు తాము పనిచేసే ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అంతేకాకుండా విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications