ఈ నెల 19 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ఈ రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 19వ తేదీన అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబరు రెండోతేదీ వరకు అక్కడే సంచరిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ మూడు రాశులపై అధికంగా ఉంటోంది. వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. మనస్పర్థలన్నీ తగ్గిపోతాయి. అదనపు ఆదాయం కోసం కొత్తగా మార్గాలు దొరుకుతాయి. వ్యాపారస్తులకు గతంలో కంటే ఇప్పుడు మరింత లాభాలు వస్తాయి. డబ్బులు కూడా భారీగా సంపాదిస్తారు. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి.

మిథున రాశి
పెండింగ్ లో ఉన్న పనులను చాలా సులువుగా పూర్తిచేస్తారు. అలాగే డబ్బు సంపాదించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తారు. పనులు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అదృష్టం విపరీతంగా పెరుగుతుంది.
సింహరాశి
ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఆదాయ వనరులు ఈ రాశివారు ఊహించనిరీతిలో పెరుగుతాయి. బంధువులు, స్నేహితులతో సంబంధాలు గతంలోకంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. పెద్దల నుంచి ఆస్తులు కలిసివస్తాయి. సంపాదన పెరగడంతోపాటు ఆస్తులు పెరిగి సమాజంలో గౌరవం పెరుగుతుంది.












Click it and Unblock the Notifications