ganesh chaturthi 2023: వినాయక చవితి ప్రాశస్త్యం ఇదే; గణేశుడి జననం ఎలా జరిగిందంటే!!
హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే వినాయక చవితి పర్వదినాన్ని వాడ వాడలా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 18వ తేదీన సోమవారం నాడు జరుపుకొని ఉన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన మొదలుకొని తొమ్మిది రోజులపాటు గణేష్ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. చిన్న పెద్ద పేద ధనిక తారతమ్య లేకుండా ప్రతి ఒక్కరు వినాయక నవరాత్రి వేడుకలను జరుపుకుంటారు.
వినాయక జననానికి సంబంధించి ఒక కథ ప్రాశస్త్యంలో ఉంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేశుడు జన్మించాడు. ఆయన పుట్టిన రోజునే వినాయక చవితి వేడుకలుగా జరుపుకుంటున్నాము. గణేశుడి జన్మ గురించిన ప్రసిద్ధ కథనం విషయానికి వస్తే పార్వతీదేవి తాను స్నానానికి ఉపయోగించిన నలుగుపిండి ముద్దతో వినాయకుడిని తయారు చేసింది.

నలుగు పిండి ముద్దతో చేసిన బొమ్మకు పార్వతి దేవి ప్రాణం పోసిందని చెబుతారు. తను స్నానం చేసి వచ్చే వరకు ద్వారం దగ్గర కాపలా ఉండమని తనయుడు అయిన వినాయకుడిని కోరి పార్వతీదేవి స్నానానికి వెళుతుంది. వినాయకుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుండగా శివుడు వచ్చి తన భార్య అయిన పార్వతీ దేవి వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు.
తల్లి ఆజ్ఞను శిరసావహించిన తనయుడు అయిన వినాయకుడు పార్వతీ దేవిని కలవడానికి నిరాకరించడంతో, శివుడు కోపంతో అతని శరీరం నుండి గణేశుడి తలను వేరు చేశాడు. అది చూసిన పార్వతీ దేవి తన కుమారుని ప్రాణాలు తనకు తెచ్చి ఇవ్వవలసిందిగా శివుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శివుడు గున్న ఏనుగు తలను గణేశుడి శరీరానికి అతికించి తిరిగి ప్రాణం పోశాడు.
అప్పటి నుండి, ఈ రోజును గణేశ చతుర్థిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన గణేష్ చతుర్థి రోజున ముహూర్తంగా ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించుకోవచ్చని చెబుతున్నారు. అయితే పర్యావరణాన్ని కాపడుకునేలా వినాయక చవితి వేడుకలను మట్టి గణనాధులను పూజిస్తూ జరుపుకోవాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications