శని "త్రయోదశి" మహిమ: మనపై ప్రభావం ఎలాగంటే?

Subscribe to Oneindia Telugu

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' నవ గ్రహాలలో ఒక ఒకడు. సూర్య,చంద్రులు ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది.ఖగోళంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద భూమిపై ఉన్న ప్రతి చరా చర జీవుల పైన జీవ నిర్జీవ వస్తువుల మీద ఉంటుంది.

Glory of Shani Trayodashi

శనిత్రయోదశి వృషభ , కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు వరుసగా "అష్టమ" , "అర్ధాష్టమ" , " ఏలినాటి శని " లతో బాధ పడుతున్న వారు.

ఈ శనిత్రయోదశి నాడు ఉదయం "శని హోరకాలంలో" అనగా ఉదయం 6:00 నుండి 7:00 మధ్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు.
సాయంత్రం "ప్రదోష వేళలో " అనగా 5:30 నుండి 6:30 మధ్య కాలంలో శివాలయం లో " నువ్వల నూనె " తో దీపారాధన చేసినచో శుభ ఫలితాలు పొందుతారు.

శని త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు.

శనివారం శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ప్రితికరమైనది. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు.

సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు.అందుకే ఆయనను సూర్యపుత్రడు అని ఛాయాసుతుడు అని పిలుస్తారు.

ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులని చుట్టి రావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది.

రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి. అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, వీలయినంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు. స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. శని త్రయోదశి తిథి నాడు
శని దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చదువుకోవాలి.

నీలాంజన సమాభాసం!
రవిపుత్రం యమాగ్రజం!!

ఛాయామార్తాండ సంభూతం!
తం నమామి శనైశ్చరమ్!!

ఓం శం శనయేనమ:
ఓం కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:
ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్,
ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః
శని గాయత్రీ మంత్రం :-
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్

ఈ శ్లోకాలు పఠించడం వలన మంచి జరుగుతుంది. భక్తులు తమ కష్టాల నుండి గట్టేక్కించమని నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసీ చూడనట్లుగా పొమ్మని వేడుకుంటారు.

ఇతని వాహనం కాకి, నలుపు, నీలి రంగులు ఈయనకు ఇష్టమైనవి. జిల్లేడు ఆకులు, నువ్వులు, నువ్వుల నూనేతో అభిషేకం స్వామికి ఇష్టం. వీటితో పూజించడం వలన శనిదేవుడికి సంతృప్తి చెందుతాడు. శని భార్య జ్యేష్ఠాదేవి. సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.

దానధర్మాలతో, సత్యాహింసలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి. శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మ ఫలాలే. వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మ ఫలితాలను కలిగేలాచేస్తాడు.

అయితే అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాలు కలిగించే వాడనే భావం ప్రబలంగా ఉంది. కానీ శని దూషణ కూడదు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణ. శని కృప సకల దేవతాకృపతో సమానం. కాగా త్రయోదశి తిథి, శనివారం శనికి ప్రీతికరమైనవి. శనీశ్వరునికి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తైలాభిషేకం శ్రేష్ఠమైనది.

ప్రతి నెలా వచ్చే త్రయోదశి తిథినాడు నువ్వులదానం కూడా ప్రశస్తమని పెద్దలు చెబుతారు.

దశరథుడు,నల మహారాజు,పరీక్షిత్తు, ధర్మరాజు మొదలైనవారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని కథనాలు ఉన్నాయి. లోహమయమైన శని ప్రతిమను నూనే పాత్రలో ఏర్పటు చేసుకుని నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, నువ్వులతో పూజించి ప్రతిమను దానం చేయాలి.

శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్టమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి. నల్ల గోవు కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి. శనివారాలలో శారీరక పుష్టి కలిగిన వారు (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి. కాకులకు ఉదయం,మధ్యాహ్న సమయంలో బెల్లంతో చేసిన రోట్టేలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాలి.వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.

ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.రామ నామం', హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం.హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆ తరువాత కాకులకు పెట్టాలి.అనాథ బాలలకు అన్నదానం చేయాలి.

పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about the Glory of Shani Trayodashi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి