• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గృహ వాస్తు సూత్రాలు:ఇంట్లో మంచి జరగాలంటే ఎలాంటి వాస్తు మార్పులు చేయాలి..?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మానవుడికి ఎంత శక్తిసామర్థ్యాలు ఉన్నా, ఎన్నితెలివితేటలు ఉన్నా వాటికి తోడు అదృష్టం కూడా తోడైతే అనితర విజయాలు సాధించవచ్చు. అయితే ఆ అదృష్టం ఎలా వస్తుందన్న విషయం గుర్తెరగాలి. ఆ దిశగా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి మానవుని జీవనంపై గృహ వాస్తు ఎంతో ప్రభావం చూపుతుందని తెలుసుకున్నాము. జాతకం, వాస్తు ఈ రెండూ మానవుని జీవనంలో ముఖ్యమైనవే. ఒక్కోసారి జాతకం బాగున్నా ఇంటి వాస్తు బాగోకపోతే ఇబ్బందులుంటాయి. ఒక్కోసారి ఇంటి వాస్తు బాగున్నా జాతకం బాగోకపోతే ఆ వ్యక్తి పైకి రాడు. అందువల్ల లోపం ఎక్కడుందో చూడాలి.

మన జాతకం బాగున్నప్పుడు అనుకోకుండానే వాస్తు బాగున్న ఇళ్లల్లోకి వెళ్తుంటాం. జాతకం బాగోలేనప్పుడు వాస్తు లేని ఇంట్లోకి కూడా వెళ్తుంటాం. అయితే గృహాన్ని సరైన వాస్తు ప్రకారము నిర్మించుకోవడం ఎంతో అవసరం. పంచ భూతాలైన... ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సఖల విజయాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Know the Vastu formulae for a house to lead a good life.

పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్నిబట్టి గృహ నిర్మాణం జరగడం ముఖ్యం. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయి.

* ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంటగదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను సంభవిస్తాయి. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది. సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్ట శక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కలిసివస్తాయి.

* వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయో చూద్దాం.

తూర్పు.. గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,

పడమర.. సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,

ఉత్తరం.. వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,

దక్షిణం.. అదృష్టం, వినోదం, కీర్తి,

వాయువ్యం.. తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,

నైఋతి.. తల్లికి సౌఖ్యం, వివాహ సఫలం,

ఈశాన్యం.. వృత్తి పరమైన అభివృద్ధి,

ఆగ్నేయం.. అదృష్టం,

* గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి అనేదాని మీద భిన్న వాదనలున్నాయి. ఉత్తరం కుబేరస్థానం. కాబట్టి కుబేర స్థానంలో నగదు బీరువా ఉండటం మంచిది. తిరుపతిలో శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో హుండీ కూడా ఉత్తర దిక్కులోనే ఉంటుంది. న్యాయబద్ధంగా సంపాదించిన సొమ్ము ఉత్తర దిక్కులో బీరువాలో ఉండటం ఉత్తమం. ఉత్తర వాయువ్యంలో కూడా బీరువా పెట్టవచ్చు.

* మీ గృహ ఆవరణలో తూర్పు, ఉత్తరం దక్షిణ, పడమరల కన్నా పల్లంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఇదే సూత్రం గృహానికే కాదు ఆ గ్రామానికి, నగరాలకు, దేశాలకు కూడా వర్తిస్తుంది. ఉత్తరం ఎత్తైతే సిరిసంపదలు చిత్తే. దక్షిణ పడమరల కొండ అష్టైశ్వర్యాలకు అండ. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

* దక్షిణ దిక్కు స్థలం కన్నా ఉత్తర దిక్కు స్థలం, పశ్చిమ దిక్కు స్థలం కన్నా తూర్పు దిక్కు స్థలం ఎక్కువగా ఉండాలి.

* ఇంటికి ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అంటారు. కానీ అది మరీ ఎక్కువగా కాదు. అది ఆ స్థల విస్తీర్ణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తూర్పు ఈశాన్యం బాగా పెరిగితే ఆ ఇల్లు ఆగ్నేయాన్ని చూస్తుంది. ఉత్తర ఈశాన్యం బాగా పెరిగితే ఇల్లు వాయువ్యాన్ని చూస్తుంది. కాబట్టి ఈశాన్యం పెరుగుదల అనేది అతిగా ఉండకూడదు.

* ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంట్లో ఉండే వారిమీదే ఉంటుంది. ఆ ఇంటి యజమాని వేరొక నగరంలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా ఆ ప్రభావం యజమాని మీద తప్పక ఉంటుంది.

* ఒక్క ఇంటి వాస్తుయే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం 50 శాతం ఆ ఇంటి మీద ఉంటుంది. కాబట్టి పరిసరాల వాస్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే దక్షిణంవైపు చెరువు ఉండటం కానీ ఉత్తరం వైపు కొండ ఉండటంగానీ లేకుండా ఇంటిని నిర్మించుకోవాలి.

* ఇంటికి తలుపులు ఉచ్చ స్థానంలో మాత్రమే ఉండాలి. అంటే దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం.. ఈ దిక్కులలో మాత్రమే తలుపులు ఉండాలి, ఈ సూత్రాన్నే ప్రతి గదికీ వర్తింపజేసుకోవాలి. ప్రహరీ గేట్ల విషయంలోనూ ఈ సూత్రాన్నే పాటించాలి.

English summary
Know the Vastu formulae for a house to lead a good life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X