నేడు అన్ని రాశులవారు ఇలా చేస్తే కుబేరయోగం!!
గురు పూర్ణిమ చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది. ఈరోజు వివిధ గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. నేటి గ్రహ సంచారం కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలనిస్తుంటే, మరికొన్ని రాశులు ప్రతికూల ఫలితాలను చూసే అవకాశం ఉంది. అయితే గురుపౌర్ణమి రోజు రాశులవారీగా చేయవలసిన నివారణలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
మేష, వృషభ రాశుల వారికి నివారణలు
మేషరాశి జాతకులు నేడు విష్ణువు ఆలయాన్ని సందర్శించి పూజలు చేయాలి. ఆ తర్వాత పసుపు బట్టలను లేదా స్వీట్లు అవసరమైన వారికి దానం చేయాలి. గురువుల నుండి ఆశీర్వాదం తీసుకుంటే గురు బలం పెరుగుతుంది. జీవితంలో సంతోషం వస్తుంది. వృషభ రాశి వారు భగవద్గీత ను లేదా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాల బోధనలను వినాలి. భగవంతుని ఆరాధనలో పాల్గొనాలి. ఆ తరువాత ఎవరికైనా అన్నదానం చేస్తే మంచిది.

మిథున, కర్కాటక రాశులవారు ఇలా చెయ్యాలి
మిధున రాశి జాతకులు గురువు బోధించిన మంత్రాలను చదువుతూ గురువులకు బహుమతులు అందించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. లేదా విష్ణుమూర్తికి పూజలు నిర్వహించి ఆయనకు అన్న పాయసాన్ని సమర్పించి అత్యంత భక్తిశ్రద్ధలతో కొలవాలి. కర్కాటక రాశి వారు గురువును పూజించాలి. శ్రీ మహావిష్ణు ఆరాధనలో పాల్గొనాలి. గురు మంత్రాన్ని పఠించడం ద్వారా లబ్ధి జరుగుతుంది.
సింహ, కన్యా, తులా రాశుల వారు ఇలా చెయ్యండి
సింహ రాశి వారు విద్యార్థులకు కావలసిన విద్యా సామాగ్రిని విరాళంగా అందించాలి. ఇతరులకు సహాయం చేయాలి. పిల్లలతో సన్నిహితంగా ఉండడానికి సమయాన్ని కేటాయించాలి. కన్యా రాశి వారు పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. రాత్రివేళ చంద్రుడికి నీటిని సమర్పించి పూజించాలి. తులా రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనాలి. గురువు ఆశీర్వాదం కోసం మతపరమైన స్థలాన్ని సందర్శించాలి.
వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి నివారణలు
వృశ్చిక రాశి వారు గురు మంత్రాన్ని పఠించాలి. పేదలకు అన్నదానం చేయాలి. వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనాలి. గురువు ఆశీర్వాదం కోసం గురువుల వద్దకు వెళ్లాలి. ధనస్సు రాశి వారు మతపరమైన తీర్థయాత్ర చేయాలి. విష్ణువుని పూజించాలి. విష్ణువుకు అన్న పాయసాన్ని నివేదించాలి. ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే మంచిది.
మకర, కుంభ, మీన రాశులవారు చెయ్యాల్సిందిదే
మకర రాశి వారు చంద్రుడిని పూజించే గురు మంత్రాన్ని పాటించాలి. విష్ణువుని పూజించి అందరికీ ప్రసాద వితరణ చెయ్యాలి. కుంభ రాశి వారు ఈరోజు సత్యనిష్ట పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. గురువుకు సేవ చేయడానికి కొంత సమయం కేటాయించాలి. భగవద్గీతను పఠించాలి. మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. గురువును పూజించాలి. వీలైనంత దానధర్మాలు చేయాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications