వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: కళ్ళక్రింద డార్క్ సర్కిల్స్ మీ ఆందోళనకు కారణమా.. నివారణకు ఇంటి చిట్కాలివే!!

|
Google Oneindia TeluguNews

చాలామంది కళ్లచుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. గతంలో చాలా తక్కువ మందిలో కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడితే, ఈ సంఖ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా విపరీతంగా పెరిగిపోయింది. మన జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, విపరీతంగా కంప్యూటర్లకు, మొబైల్ ఫోన్లకు అడిక్ట్ కావడం, విపరీతంగా పెరిగిపోయిన ఒత్తిడి వంటి అనేక కారణాలు మన కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

health tips: నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? ఎన్ని ఆరోగ్యసమస్యలు వస్తాయో తెలుసా!!health tips: నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? ఎన్ని ఆరోగ్యసమస్యలు వస్తాయో తెలుసా!!

 కళ్ళ క్రింద నల్లని వలయాలు .. కారణాలివే

కళ్ళ క్రింద నల్లని వలయాలు .. కారణాలివే

ఇలా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడిన వారి వయసు, అసలు వయసు కంటే పెద్దగా కనిపిస్తుంది. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి ముఖం అందాన్ని పాడుచేస్తాయి. ముఖ్యంగా యువతలో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఆందోళనకు కారణంగా మారుతున్నాయి. వాటిని ఎలాగైనా తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, చాలా మందిలో పెరుగుతున్న ఒత్తిడి డార్క్ సర్కిల్స్ సమస్యను మరింత పెంచుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే అలర్జీలు, విపరీతంగా జలుబు చేయడం, సైనసైటిస్ ప్రాబ్లం వంటి అనేక సమస్యలు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇక కొందరిలో పోషకాహారలోపం కూడా కళ్ళకింద నల్లటి వలయాలు ఏర్పడడానికి కారణం.

 కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ కు ఇవి కూడా కారణాలే

కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ కు ఇవి కూడా కారణాలే


ధూమపానం చేసే వారిలో, సరిగ్గా నిద్రపోని వారిలో, ఇన్సోమ్నియా తో బాధపడుతున్న వారిలో, ఎండలకు ఎక్కువగా తిరుగుతున్న వారిలో, కొన్ని సందర్భాలలో జెనెటికల్ కారణాలతో కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడం, మన కళ్ళకు సరైన విశ్రాంతిని ఇవ్వడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ తగ్గటానికి ఇంటి చిట్కాలు

కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ తగ్గటానికి ఇంటి చిట్కాలు


ఇక కళ్లకు సంబంధించిన నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని తెలుస్తుంది. కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి అవి చాలా అసహ్యంగా కనిపిస్తుంటే, డార్క్ సర్కిల్స్ నివారణకు టీ బ్యాగ్ తెరఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనికోసం చేయవలసిందల్లా టీ తయారు చేసుకున్న తర్వాత, ఆ పొడిని ఓ బ్యాగ్ లో చేర్చుకోవాలి. ఆ టీ బ్యాగ్ ను ఫ్రిజ్లో ఉంచి కూల్ చేయాలి. ఆ తరువాత టీ బ్యాగ్ ను కళ్ళ పైన కంటిచుట్టూ పెట్టుకోవాలి. టీలో ఉండే కెఫిన్ రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఈ సమస్య తొలగిపోతుంది. అయితే క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు చేస్తే మెరుగైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

నల్లటి వలయాలు తగ్గాలంటే పాలతో మసాజ్ చెయ్యండి

నల్లటి వలయాలు తగ్గాలంటే పాలతో మసాజ్ చెయ్యండి


ఇక కళ్లకింద నల్లటి వలయాలు తగ్గించుకోవడం కోసం అద్భుతంగా పని చేసే మరొక హోమ్ రెమిడీ పాలు. పాలను ఫ్రిజ్లో పెట్టి బాగా చల్లగా అయ్యేలా చేసి, ఆ చల్లని పాలతో చర్మంపై, కంటి చుట్టూ మసాజ్ చేయాలి. రెండు నుండి మూడు స్పూన్ల పాలు తీసుకొని నల్లటి వలయాలు ఏర్పడిన చోట మసాజ్ చేసి అరగంట తరువాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ పోవడమే కాకుండా, చర్మం కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది.

 కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఇవి ఎంతో అవసరం

కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఇవి ఎంతో అవసరం


ఇక ఇవి మాత్రమే కాకుండా ముఖ్యంగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం, ఎక్కువగా మంచి నీళ్లు తాగడం అవసరమని చెబుతున్నారు. కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయని ఆందోళన చెందే బదులు, అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వచ్చిన తర్వాత చిన్న చిన్న రెమిడీస్ ఫాలో అయ్యి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Dark circles under the eyes are caused by malnutrition, excessive stress, use of computers and mobile phones. It is said that cool tea bags therapy and cool milk therapy are very useful for their prevention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X