• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: విపరీతంగా గురక పెడుతున్నారా? జాగ్రత్త పడకుంటే ఈ జబ్బుల ప్రమాదం; అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

కొంతమంది విపరీతమైన గురక పెడుతూ ఉంటారు. వారి గురక వల్ల పక్కన పడుకున్న వారి నిద్రకు కూడా భంగం కలుగుతుంది. ఇక వారు కూడా అనేక సార్లు నిద్ర భంగానికి గురవుతారు. గురక పెడితే ఏమవుతుందిలే అని భావించే వారందరికీ వైద్యులు గురక మంచిది కాదని సలహా ఇస్తున్నారు. విపరీతంగా గురక వస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. విపరీతంగా గురకపెట్టే వారిలో అకస్మాత్తుగా అనేకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, హార్ట్ ఫెయిల్యూర్ కు కూడా గురక కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.

విపరీతంగా గురక... అనేక రోగాలకు మూలం

విపరీతంగా గురక... అనేక రోగాలకు మూలం

మనం గాలి తీసుకునేటప్పుడు ఏదైనా అడ్డంకి ఎదురైతే శ్వాసనాళాల్లో ఇబ్బందిగా మారినపుడు గురక వస్తుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఇబ్బంది తలెత్తుతుంది. గురకను వైద్యపరిభాషలో స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా తో బాధపడుతున్న వారు, అనేకమార్లు నిద్ర నుండి మేల్కొంటారు. వీరు ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించలేరు. దీంతో వీరు పగటిపూట అదనపు అలసటతో ఉంటారు. విపరీతంగా ఉన్న గురక సమస్యకు చికిత్స చేయించకుండా వదిలేస్తే ఇది గుండె జబ్బులు, మధుమేహం మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలకు కారణం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఊబకాయం, ఆస్తమా, డయాబెటిస్ వచ్చే ప్రమాదం

ఊబకాయం, ఆస్తమా, డయాబెటిస్ వచ్చే ప్రమాదం

ఊబకాయం మరియు అధిక రక్తపోటుతో సహా అనేక ఆరోగ్య సమస్యలు గురకతో ముడిపడి ఉన్నాయి. విపరీతమైన గురక వల్ల ఆస్తమా మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్న వారిలో ఈ లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. విపరీతమైన గురక సమస్య ఉన్న వ్యక్తులు ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేసే అవకాశం ఉంది, ఈ పరిస్థితిలో కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు స్పందించవు. మీ కణాలు అవసరమైన విధంగా ఇన్సులిన్ తీసుకోనప్పుడు, మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది . దీంతో మీరు టైప్ 2 డయాబెటిస్‌ బాధితులుగా మారవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

రక్తపోటు, ఫ్యాటీ లివర్, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం

రక్తపోటు, ఫ్యాటీ లివర్, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం

అధిక రక్తపోటు, అధిక ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక బ్లడ్ షుగర్ స్థాయిలు, గుండె జబ్బుల ప్రమాదం, మెటబాలిక్ సిండ్రోమ్‌ సమస్యలు స్లీప్ అప్నియాతో వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మీకు స్లీప్ అప్నియా ఉంటే, మీరు ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విపరీతమైన గురక జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని గుండెల్లో మంట మరియు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి యొక్క ఇతర లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుంది, ఇది మీ నిద్రకు మరింత అంతరాయం కలిగిస్తుంది.

విపరీతమైన గురకతో గుండె పోటు వచ్చే ఛాన్స్

విపరీతమైన గురకతో గుండె పోటు వచ్చే ఛాన్స్


ఇది మీ గుండెపై ఒత్తిడిని పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మీకు విపరీతమైన గురక సమస్య ఉన్నట్లయితే, హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. స్లీప్ అప్నియా ఉన్నవారిలో గుండె ఆగిపోవడం కూడా చాలా సాధారణం అని హెచ్చరిస్తున్నారు. విపరీతమైన గురక వల్ల నాడీ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుందని, నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.

గురక పెట్టే వారిలో సెక్స్ సామర్ధ్యం తగ్గుతుంది

గురక పెట్టే వారిలో సెక్స్ సామర్ధ్యం తగ్గుతుంది

గురక పెట్టే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పని చేయని వైద్యులు చెబుతున్నారు. స్లీప్ అప్నియా మీ సెక్స్ కోరికను తగ్గిస్తుంది. పురుషులలో, ఇది అంగస్తంభన లోపం మరియు పిల్లలను కలిగి ఉండే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. స్లీప్ అప్నియా వల్ల చిరాకు కలుగుతుందని, నీరసంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితులు, నిద్ర లేకపోవడంతో పాటు, మీ శరీరంలోని అనేక విభిన్న వ్యవస్థలకు హాని కలిగిస్తాయి.

బరువు తగ్గటం, వ్యాయామం చెయ్యటంతో పాటు చెయ్యాల్సింది ఇదే

బరువు తగ్గటం, వ్యాయామం చెయ్యటంతో పాటు చెయ్యాల్సింది ఇదే

కొంతమంది ఊబకాయం ఉన్నవారిలో విపరీతంగా గురకపెట్టే సమస్య ఉంటుందని, వారు బరువు తగ్గితే ఆ సమస్య నుండి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విపరీతంగా కొలెస్ట్రాల్ ఉన్న వారిలోనూ ఈ సమస్య ఉంటుందని, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తే స్లీప్ ఆప్నియా నుండి కొంతమేర బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

English summary
Snoring excessively? too much of snoring is called sleep apnea. If not careful, there is a risk of diseases like obesity, asthma, diabetes, BP and gastrointestinal problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X