వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుర్ముఖి నామ సంవత్సరం రాశిఫలాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

రాశి ఫలాలు తెలుసుకునే ముందు కొన్ని తెలుగసకోవాలి. రాశి ఫలాలో చెప్పే విషయాలు తమ జాతకంతోనే సరి చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి రాశి ఫలాలో వివాహం ఈసంవత్సరం జరుగుతుంది అనుకుంటే. ఆవ్యక్తి జాతకంలో వివాహానుకూలత 75శాతం ఉండాలి. ప్రతికలాంశ, వివాహభావానికి మాంగల్య దోషం, కుజదషం లేకుండా ఉండటం వంటివి అవసరం. ఇలాంటి కొన్ని ఆటంకాల వల్ల జరగక పోవచ్చు. మరికొన్ని తప్పకుండా జరుగుతాయి. అలాంటివి గమనించుకోవాలి.

మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)

మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)

ఆదాయం -14, వ్యయం-14. రాజ్యపూజ్యం-3,అవమానం -6.

మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి- ఆగస్టువరకు బాగుంటుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆగస్టు తర్వాత కొంత నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకి- అనుకూలంగా లేదు. ఉద్యోగాలు తక్కువస్థాయివి పొందుతారు. కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు తక్కువ. వివాహంకానివారికి - ఈ సంవత్సరం వివాహం అవుతుంది. ఉద్యోగులకి- ప్రమోషన్స్‌ జరుగవు. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. పైవారి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకి - నూతన వ్యాపారులకి కొంత సమస్య కాలం. మొత్తానికి మిశ్రమ ఫలితం.

గురుని 2016 ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. ఐశ్వర్యము పొందుతారు, ధనలాభము కలుగుతుంది, కొత్తస్నేహితులను కలుసుకుంటారు, వ్యవహారం లేదా చేసే పనులలో అనుకూలత ఏర్పడుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధుజనుల ప్రోత్సాహము పొందుతారు, సజ్జనులస్నేహము పొందుతారు, సంతానము కలలుగుటకు అవకాశం వుంది, రాజానుగ్రహము పెద్దల అనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు, కలుగును.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన అష్టమ శని తీవ్ర దోషఫలదాత, అపమృత్యు భయము, రోగబాధ, ధనవ్యయము, అతురత, బంధుక్లేశము, వ్యవహార చిక్కులు, కార్యనాశనము పశునాశనము, కుటుంబమునకు దూరమగుట, మిత్ర విరోధము, సంతాన సౌఖ్యలోపము మరెన్నొ కష్టనష్టములు కలుగును.

ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన భాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దుఃఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి, దారిద్య్రత, పితృ వర్గమునకు అరిష్టము, కొన్ని సందర్భాలలో అల్ప సుఖము, ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును.రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటు స్వల్ప అనుకూల ఫలితములు కూడా కలుగును.

కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా లాభస్థానమందు వీరు ఉత్కృష్టమైన లాభాలను కల్పిస్తారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును.

 వృషభ రాశివారు (కృత్తిక2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

వృషభ రాశివారు (కృత్తిక2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం -8, వ్యయం-8. రాజ్యపూజ్యం -6,అవమానం -6.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి- ఆశించిన ఫలితాలు ఉండవు. పోటి పరీక్షలు వ్రాసేవారికి నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకి- మంచి ఫలితం పొందుతారు. పైవారి ఆధరణ పొందుతారు. వివాహం కానివారికి - ఈసారి వివాహం అవుతుంది. ఉద్యోగులకి- ప్రమోషన్స్‌ లభిస్తాయి. కుటుంబానికి దూరంగా గడుపుతారు. వ్యాపారులకి- అన్ని విధాలుగా బాగుంటుంది.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, హృదయ మునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన అష్టమ శని తీవ్ర దోషఫలదాత, అపమృత్యు భయము, రోగబాధ, ధనవ్యయము, అతురత, బంధుక్లేశము, వ్యవహార చిక్కులు, కార్యనాశనము పశునాశనము, కుటుంబమునకు దూరమగుట, మిత్ర విరోధము, సంతాన సౌఖ్యలోపము మరెన్నొ కష్టనష్టములు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన బుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా దశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యం, సంతోషం, కష్టాలు తొలిగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది.
గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టి మాత్రమే ధరించాలి)కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శ��ఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు, ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం - 11, వ్యయం-5. రాజ్యపూజ్యం-2,అవమానం -2.

మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి- అన్ని విధాలుగా బాగుటుంది. నిరుద్యోగులకి- మంచి ఫలితాలు పొందుతారు. వివాహంకానివారికి - ఈ సంవత్సరం వివాహం అవుతుంది. ఉద్యోగులకి-ప్రమోషన్స్‌ కుటుంబజీవనం బాగుంటుంది. వ్యాపారులకి-మంచి లాభాలు పొందుతారు.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా కష్ట నష్టములుకలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళనకలుగుతుంది, అవమానము ఏర్పడతాయి, ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చుపరిస్థితి ఏర్పడుతుంది, దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము.మాటవిలువ తగ్గుట జరుగును.శని 2017జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము, సర్వతో ముఖాభివృద్ధి కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, హృదయ మునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. గ్రహాల పరిహారాలు
గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండి వంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)

కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)

ఆదాయం -5, వ్యయం-5. రాజ్యపూజ్యం-5, అవమానం -2.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-మంచిమార్కులు పొంది ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో విజయం పొందుతారు. నిరుద్యోగులకి-మంచి ఉద్యోగాలు పొందుతారు. వివాహంకానివారికి -తప్పకుండా వివాహం జరుగుతుంది. ఉద్యోగులకి-ప్రమోషన్స్‌ పొందుతారు. వ్యాపారులకి- కిందటి సంవత్సరంకంటే బాగుంటుంది.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శత్రువులు తగ్గుతారు, అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన శని పంచమ రాశి యందు చలించు సమయమున కార్యములు చెడుట జరుగుతుంది, మనస్తాపము కలుగును, దాయాదులతో వ్యాజ్యములు (న్యాయసంబంధ చర్చలు,గొడవలు జరుగుతాయి), హీన జాతి స్త్రీతో సంభోగించి దాని వలన పరితపించుట, సంతాన నష్టము కలుగుతుంది, వ్యవహారములలో భంగములు ఏర్పడతాయి, వ్యాజ్యములు (కోర్టు లావాదేవీలు), చిత్తభ్రమ కలుగుతుంది, సంసారమునకు దూరమగుట వంటి ప్రతికూల ఫలితములు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము, సర్వతో ముఖాభివృద్ధి కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన గోచార కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, అనారోగ్యం, ఆందోళన, క్రూరజంతు భయం, కార్యనాశనం, ప్రయాణాయాసము, ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును.

గ్రహాల పరిహారాలు
శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) రాహు గ్రహానికి పరిహారాలు - అనేకరూప వర్ణైశ్చ శతశః అథసహస్రశః | ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః|| ఈశ్లోకాన్ని జపించాలి.దానాలు - ముల్లంగివంటి దుంపలు, మినప్పప్పుతో చేసినవడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాలసర్పపూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం)

సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం)

ఆదాయం - 8, వ్యయం -14. రాజ్యపూజ్యం - 1,అవమానం -5.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-నిరాశ మిగులుతుంది. పోటి పరీక్షలలో కోరుకున్న సీట్లు పొందలేరు. నిరుద్యోగులకి-అంతగా అనుకూలంగా లేదు. వివాహంకానివారికి -ఆగస్టుతర్వాత వివాహం అవుతుంది. ఉద్యోగులకి-పని ఒత్తిడి, దూరప్రాంతాల బదిలి, అపనింద పొందుతారు. వ్యాపారులకి- నిరాశజనకంగా ఉన్నా కొద్దిపాటి లాభాలు పొందుతారు.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా వ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు, అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి.గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శత్రువులు తగ్గుతారు, అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన అర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, మనఃక్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటు నుండి బ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నష్టము, వాత వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు, శారీరక పుష్టితగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన శని పంచమ రాశి యందు చలించు సమయమున కార్యములు చెడుట జరుగుతుంది, మనస్తాపము కలుగును, దాయాదులతో వ్యాజ్యములు (న్యాయసంబంధ చర్చలు,గొడవలు జరుగుతాయి), హీన జాతి స్త్రీతో సంభోగించి దాని వలన పరితపించుట, సంతాన నష్టము కలుగుతుంది, వ్యవహారములలో భంగములు ఏర్పడతాయి, వ్యాజ్యములు (కోర్టు లావాదేవీలు), చిత్తభ్రమ కలుగుతుంది, సంసారమునకు దూరమగుట వంటి ప్రతికూల ఫలితములు కలుగును.రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన గోచార రాహు కేతువులు ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా ఈ స్థానములో రాహు కేతువులు వ్యతిరేక ఫలదులు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధాన్యాదులు లభ్యమగును. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగును.

గ్రహాల పరిహారాలు
శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)రాహు గ్రహానికి పరిహారాలు - అనేకరూప వర్ణైశ్చ శతశః అథసహస్రశః | ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః|| ఈశ్లోకాన్ని జపించాలి.దానాలు - ముల్లంగివంటి దుంపలు, మినప్పప్పుతో చేసినవడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాలసర్పపూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు)

కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు)

ఆదాయం -11, వ్యయం -5. రాజ్య పూజ్యం -4, అవమానం -5.

మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-గురుబలం బాగాలేదు. సమయం నిరుపయోగం చేస్తారు. దాని ఫలితంగా నష్టపోతారు. నిరుద్యోగులకి-ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది కాని అంత బాగుండదు. వివాహంకానివారికి -ఆగస్టు తర్వాత వివాహం అవుతుంది. ఉద్యోగులకి-సాధారణ జీవనం. ఉద్యోగమార్పిడికి అవకాశం ఉంది. వ్యాపారులకి-లోహసంబంధం మొదలైన వారికి కొంత అనుకూలత. ఇతరులకు మామూలుగా ఉంటుంది.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా ఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్తినష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు.గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగావ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు, అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన శనికి ఇది అనుకూల స్థానము. స్త్రీ సంభోగము పొందుతారు, మనసులో సుఖభావన పొందుతారు, స్వంతబుద్ధిచే ప్రయత్నించిన కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, బుద్ధి బలము పెరుగుతుంది, ధన లాభము కలుగుతుంది, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలనఅర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, మనఃక్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటు నుండి బ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నష్టము, వాత వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు, శారీరక పుష్టితగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన రాహు, కేతువులు షష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, విక్రమము, సాహస కార్యనిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఎల్లప్పుడూ సుఖము, శత్రు వర్గము నుండి భూలాభము వంటి మంచి ఫలితాలనిస్తారు. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా 12వ స్థానం చలనం అశుభ ఫలితము ఇచ్చును. దరిద్రము, ధన నాశనము, నేత్ర బాధలు, శత్రుభయము, అన్ని కార్యములు విఘ్నముగుట, స్థాన చలనం, రావలసిన లాభాలకు ఆటంకము, అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.

గ్రహాల పరిహారాలు
గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) రాహు గ్రహానికి పరిహారాలు - అనేకరూప వర్ణైశ్చ శతశః అథసహస్రశః | ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః|| ఈశ్లోకాన్ని జపించాలి.దానాలు - ముల్లంగివంటి దుంపలు, మినప్పప్పుతో చేసినవడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాలసర్పపూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు)

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం -8, వ్యయం -8. రాజ్య పూజ్యం - 7, అవమానం -1.

మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అన్ని విధాల అనుకూలత. నిరుద్యోగులకి-కోరుకున్న ఉద్యోగం పొందుతారు. వివాహంకానివారికి -తప్పక వివాహం జరుగుతుంది. ఉద్యోగులకి-ప్రమోషన్స్‌, విహారయాత్రలు లభిస్తాయి. వ్యాపారులకి- కొంత నష్టం పొందుతారు.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయముకలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగాఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్తినష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. శని రెండవ రాశి యందు చలించునపుడు కార్యములు నశించుట జరుగుతుంది, తలత్రిప్పుట, తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును. ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన శనికి ఇది అనుకూల స్థానము. స్త్రీ సంభోగము పొందుతారు, మనసులో సుఖభావన పొందుతారు, స్వంతబుద్ధిచే ప్రయత్నించిన కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, బుద్ధి బలము పెరుగుతుంది, ధన లాభము కలుగుతుంది, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన లాభస్థానమందు వీరు ఉత్కృష్టమైన లాభాలను కల్పిస్తారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటు స్వల్ప అనుకూల ఫలితములు కూడా కలుగును.

గ్రహాల పరిహారాలు
శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వుల నూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు-రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

ఆదాయం -14, వ్యయం -14. రాజ్య పూజ్యం -3, అవమానం -1.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకి- ఉద్యోగం లభిస్తుంది. వివాహంకానివారికి - ఆగస్టు తర్వాత వివాహం జరుగుతుంది. ఉద్యోగులకి-పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో చిక్కులు వస్తాయి. వ్యాపారులకి-నష్టాలు ఎక్కువ.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా దోష ఫల స్థానము. వస్తువులు, ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధనధాన్యములు నష్టమవుతాయి, స్నేహితులకు దూరమవుతారు, వృధాప్రయాణాలుచేస్తారు.గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయముకలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. శరీరంలో తేజస్సు తగ్గటం, భయం, రోగంకలుగుతాయి, దుఃఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన ఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. శని రెండవ రాశి యందు చలించునపుడు కార్యములు నశించుట జరుగుతుంది, తలత్రిప్పుట, తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన దశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యం, సంతోషం, కష్టాలు తొలిగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా బుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును.

గ్రహాల పరిహారాలు
గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)శని 2017 జనవరి 26వరకు శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమ శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం)

ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం)

ఆదాయం -2, వ్యయం -8. రాజ్య పూజ్యం-6, అవమానం -1.

మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అన్నివిధాలుగా బాగుంది. చెడు సహవాసాలు తగ్గించుకోవాలి. నిరుద్యోగులకి-ఏదో ఒక ఉద్యోగం పొందుతారు. వివాహంకానివారికి -వివాహం అవుతుంది. ఉద్యోగులకి- పనిఒత్తిడి, అపనింద ప్రమోషన్స్‌ లాంటి మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపారులకి-అనుకూల కాలం.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, కొత్తవస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా దోష ఫల స్థానము. వస్తువులు, ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధనధాన్యములు నష్టమవుతాయి, స్నేహితులకు దూరమవుతారు, వృధాప్రయాణాలు చేస్తారు.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనశని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము, మనఃక్లేశము, గృహచ్ఛిద్రములు, నష్టము, దుఃఖము, దారిద్య్రము, భోజన సౌఖ్య భంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన ఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. శరీరంలో తేజస్సు తగ్గటం, భయం, రోగంకలుగుతాయి, దుఃఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా తృతీయ స్థానములో శుభ ఫలదాతలు, కీర్తి, శరీర బలము, ప్రజల్లో మాటకు విలువ పెరగటం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటు భాతృద్వేషము కల్పిస్తాడు.

గ్రహాల పరిహారాలు
శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం -5, వ్యయం -2. రాజ్యపూజ్యం-4,అవమానం -4.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అనుకూలంగా లేదు. నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకి- ఆగస్టు తర్వాత బాగుంటుంది. వివాహంకానివారికి -సెప్టెంబరు తర్వాత వివాహం అవుతుంది. ఉద్యోగులకి- ఆగస్టు వరకు బాగుంటుంది. వ్యాపారులకి- అన్నివిధాల లాభదాయకం.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, అరిష్టముకలుగును, ధననష్టము జరుగుతుంది, దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, కొత్తవస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనమిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలనశని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము, మనఃక్లేశము, గృహచ్ఛిద్రములు, నష్టము, దుఃఖము, దారిద్య్రము, భోజన సౌఖ్య భంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును.రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, అనారోగ్యం, ఆందోళన, క్రూరజంతు భయం, కార్యనాశనం, ప్రయాణాయాసం, ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును.

గ్రహాల పరిహారాలు
గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)శని 2017 జనవరి 26వ తర్వాత శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం -5, వ్యయం -2. రాజ్య పూజ్యం -5, అవమానం -4.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-ఆగస్టు వరకు బాగుంటుంది. నిరుద్యోగులకి-ఆగస్టు లోపే ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయాలి. వివాహంకానివారికి - అవుతుంది. ఉద్యోగులకి-సెప్టెంబరరు తర్వాత కొంత ప్రతికూలత వస్తుంది. వ్యాపారులకి-ఆగస్టు తర్వాత కొంత రాబడి తగ్గుతుంది.

గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా శుభఫలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను, గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, అరిష్టముకలుగును, ధననష్టము జరుగుతుంది, దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనదశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలనమిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన ఈ స్థానములో రాహు కేతువులు వ్యతిరేక ఫలదులు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధాన్యాదులు లభ్యమగును. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా గోచార రాహు కేతువులు ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును.

గ్రహాల పరిహారాలు
గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

 మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

ఆదాయం -2, వ్యయం -8. రాజ్య పూజ్యం -1, అవమానం -7.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అనుకూల కాలం. నిరుద్యోగులకి-మంచి కాలం. వివాహంకానివారికి -జరుగుతుంది. ఉద్యోగులకి-శ్రమకు తగిన ఫలితం వస్తుంది. వ్యాపారులకి - చాలా లాభదాయక కాలం.

గురుని 2016ఆగస్ట్‌ 11 వరకు సింహంలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా శుభఫలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను, గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును.
శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనభాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దుఃఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి, దారిద్య్రత, పితృ వర్గమునకు అరిష్టము, కొన్ని సందర్భాలలో అల్ప సుఖము, ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన దశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును.

రాహువు సంవత్సరాంతం వరకు సింహరాశి సంచారం వలన రాహు, కేతువులు షష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, విక్రమము, సాహస కార్యనిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఎల్లప్పుడూ సుఖము, శత్రు వర్గము నుండి భూలాభము వంటి మంచి ఫలితాలనిస్తారు.

కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా అశుభ ఫలితములిచ్చును. దరిద్రము, ధన నాశనము, నేత్ర బాధలు, శత్రుభయము, అన్ని కార్యములు విఘ్నముగుట, స్థాన చలనం, రావలసిన లాభాలకు ఆటంకము, అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.

గ్రహాల పరిహారాలు
గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండి వంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్ని బట్టి మాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌ కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

English summary
Astrologer Maruthi Shrama has presented raasi Phalalu of Durmukhi on the occasion of Telugu New Year Ugadi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X