• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏకాదశి ఉపవాస వ్రతం ఎలా చేయాలి

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల, కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలోనున్నవి.

మాసము మాస దేవడ శుద్ధ ఏకాదశి పర్వదినం బహుళ ఏకాదశి పర్వదినం

చైత్రము విష్ణువు కామదా వరూథినీ

వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా

జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ

ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా

శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా

భాద్రపదము హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా

ఆశ్వయుజము పద్మనాభుడు పాశాంకుశ రమా

కార్తీకము దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి

మార్గశిరము కేశవుడు ధృవ, మొక్షద సఫల

పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా

మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ

ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ

అధికము పురుషోత్తముడు పద్మినీ పరమా ( అధిక మాసం ) 3 సంవత్సరములకు ఒకసారి,

ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునే వారు దశమి రోజునుంచే కొన్ని తప్పని సరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలై నిషేధిత పదార్థాలు ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి.

how to do ekadasi vratham in telugu astrology

ఏకాదశి రోజు ఉదయం: దంతావధానం చేయకుండా నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకుని నమలండి. నోట్లో వేలు పెట్టి గొంతు శుభ్రపరచుకోండి. చెట్లనుంచి ఆకులను తుంచకూడదు. చెట్టునుంచి రాలిన ఆకునే వాడాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నీటితో 12 సార్లు పుక్కలించండి. ఆ తర్వాత స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవద్గీత పఠనం చేయాలి లేదా పురోహితుడు చదువుతుంటే మీరు వినాలి. "ఈ రోజు నేను దొంగతనం, దురాచారం చేసే మనుషులతో మాట్లాడను అలాగే ఎవరి మనసు నొప్పించను" అని దేవుని ముందు ప్రమాణం చేయాలి.

" ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు శహస్రనామాలను జపించండి. విష్ణు భగవానుడిని స్మరించి ప్రార్థించండిలా... హే త్రిలోక నాథా! నా గౌరవం నీ చేతిలో ఉంది. కాబట్టి నేను చేసిన ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి శక్తిని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి.

ఒకవేళ ఏమరుపాటుతో తప్పుడు కార్యక్రమాలతో సంబంధమున్నవారితో మాట్లాడితే సూర్యనారాయణ దేవుడిని దర్శించుకుని ధూప, దీప నైవేద్యాలతో శ్రీహరిని పూజించి క్షమించమని వేడుకోండి. ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. ఎందుకంటే చీమలు మొదలైన సూక్ష్మ జీవులు చనిపోతాయనే భయం ఉంటుంది. అంటే చిన్న ప్రాణికికూడా హాని కలుగచేయకూడదు. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడకూడని మాటలుకూడా మాట్లాడాల్సివస్తుంది.

ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజు వీలైనంత ఎక్కువగా దాన, ధర్మాలు చేయాలి. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకూడదు. దశమితో కలిసి వచ్చే ఏకాదశిని వృద్ధ ఏకాదశిగా పేర్కొంటారు. ముఖ్యంగా వైష్ణవులు యోగ్య ద్వాదశి కనుక వస్తే ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. త్రయోదశి వచ్చే ముందే వ్రతాన్ని పూర్తి చేసి వ్రత పారాయణ చేయాలి.

ఫలాహారంలో క్యారెట్టు, గోభీ, పాలాకులాంటి ఇతర ఆకుకూరలు వాడకూడదు. అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష, బాదం, పిస్తా మొదలైన పండ్లను ఆహారంగా తీసుకోవాలి. మీరు ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం భగవంతునికి సమర్పించి ఆ తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు తులసీ దళం సమర్పించాలి. ద్వాదశిరోజున గోవునకు తీపి పదార్థాలు, గ్రాసం, పండ్లు ఇవ్వాలి. ఎవరిపైననూ కోపగించుకోకుండా మంచి మాటలు మాట్లాడాలి. ఈ వ్రతం చేసేవారు అత్యద్భుతమైన ఫలితాలను పొందవచ్చును.

English summary
how to do ekadasi vratham in telugu astrology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X