ధనిష్ఠలో జన్మిస్తే సైంటిస్టులు అవుతారా ?

Posted By:
Subscribe to Oneindia Telugu

ధనిష్ఠ జాతకులకు దాతృత్వం, ఉపకారగుణం, రోష పౌరుషాలు, అధిక సంపాదనాభిలాష, సంగీతం పట్ల అభిరుచి అధికం. క్రీడలలో ఆసక్తి, కార్యనిర్మహణ సమర్థత, శ్రమించే స్వభావం వుంటాయి. ఖండితంగా వ్యవహరిస్తారు. వ్యసనపరులౌతారు. శ్వాస రుగ్మతలు రావచ్చు. ధనిష్ఠలో పుట్టిన మహిళలకు దయ, రుణ, పుణ్యకథలు వినే ఆసక్తి ఉపకార గుణం వుంటాయి.

మొదటి పాదంలో పుట్టినవారు: రవి నృపాంశ స్థూలమైన శరీరం కలవారు, దాన గుణాలు కలవారు, స్త్రీ ప్రీతి కలవారు, వ్యవహారాల్లో నేర్పరులు అవుతారు.

If you born in Dhanishta nakshatra

రెండవ పాదంలో పుట్టినవారు:

బుధుడు సౌమ్యాంశ - చమత్కారంగా మాట్లాడేవారు. వినయంగా ప్రవర్తించేవారు. గణిత విద్యయందు ఆసక్తి కలవారు, వయసుకన్నా తక్కువ కనిపించేవారవుతారు.

మూడవ పాదంలో పుట్టినవారు: శుక్ర అభయాంశ - దానధర్మాలు చేయడం, శాస్త్రపాండిత్యం. ధైర్యం, కళాప్రియత్వం, సత్యవచనం, ప్రదర్శన మొదలైన గుణాలుంటాయి.

నాలుగవ పాదంలో పుట్టినవారు: కుజ నీచాంశ - క్రూరగుణం, స్థూల శరీరం,పాపకర్మప్రియత్వం, కలహం, రహస్య వర్తన, దుష్టస్నేహాదులుంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If you born in Dhanista Nakshatra your features will be according to the above said details.
Please Wait while comments are loading...