నెట్టింట హల్‌చల్ చేస్తున్న కేటీఆర్ ఫోన్ కాల్ వీడియో!

తెలంగాణలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ అంతర్గత సమావేశంలో ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని ఎస్ఆర్ నగర్‌లో నివసిస్తున్న శ్రావణి అనే సామాన్య మహిళకు ఎదురైన నీటి సమస్యను పరిష్కరించడంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపిన చొరవను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలో చెప్పడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించిన తీరే నిదర్శనమని కేటీఆర్ కొనియాడారు.

అసలేం జరిగిందంటే?
ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో తీవ్రమైన నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న శ్రావణి అనే మహిళ తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక గూగుల్‌లో వెతికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ నంబర్‌ను కనుక్కుంది. ఏ మాత్రం సంకోచించకుండా ఆమె నేరుగా తలసానికి ఫోన్ చేసి తన కాలనీలోని నీటి కష్టాలను వివరించింది. లీడర్లు ఫోన్లు ఎత్తరు అనే అపోహను పటాపంచలు చేస్తూ.. తలసాని వెంటనే ఆమె ఫోన్ కాల్‌కు స్పందించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న తలసాని.. తక్షణమే తన పీఏను అలర్ట్ చేసిన కేవలం గంటన్నర వ్యవధిలోనే సదరు మహిళ ఇంటికి వాటర్ ట్యాంకర్‌ను పంపించి నీటి సమస్యను తీర్చారు.

KTR Viral Phone Call Video Praising Talasani Over Water Issue Wins Internet Attention Details

ఈ నాయకత్వ లక్షణాలు, తలసాని సమయస్ఫూర్తిని పార్టీ శ్రేణులకు వివరించే క్రమంలో కేటీఆర్ స్వయంగా ఆ మహిళకు ఫోన్ చేశారు. సమావేశం జరుగుతుండగానే స్పీకర్ ఆన్ చేసి కేటీఆర్ సదరు మహిళ శ్రావణితో మాట్లాడారు. తలసానికి ఫోన్ చేసినప్పుడు ఏం జరిగింది? ఎంతసేపట్లో వాటర్ ట్యాంకర్ వచ్చింది? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గూగుల్‌లో నంబర్ వెతికి ఫోన్ చేయగానే ఎమ్మెల్యే స్పందించి గంటన్నరలోనే నీళ్లు పంపించారని ఆ మహిళ కేటీఆర్‌కు వివరించింది. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఓ సామాన్యురాలి సమస్యపై స్పందించిన విధానం, దాన్ని కేటీఆర్ అభినందించిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ విషయమై కేటీఆర్ సదరు మహిళతో ఫోన్‌లో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+