"ప్రధాని మోదీ, విజయ్ జాతకం సేమ్ టూ సేమ్.. ఏదోరోజు ప్రధానిగా విజయ్"

తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. టీవీకే పార్టీ పెట్టిన రెండేళ్లలోనే డీఎంకే, అన్నాడీఎంకే లాంటి కంచుకోటల్ని బద్దలు కొట్టి తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా అవతరించారు విజయ్. ఓ హీరో రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేసిన తొలిసారే ముఖ్యమంత్రి కావడం కేవలం ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి వారికే చెల్లింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత విజయ్ ఇప్పుడు ఆ మహనీయుల సరసన చేరారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాల్ని దక్కించుకుని రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత మిత్ర పక్షాల మద్దతుతో విజయ్ సీఎం పీఠాన్ని ఎక్కారు.

అయితే విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఇటీవల పలు కారణాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌ను విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొలిటికల్ గా నియమించడం తమిళనాడులో పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఒక జ్యోతిష్యుడిని అధికారిక పోస్టులో నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. దాంతో చేసేదేమీ లేక నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది.

అయితే విజయ్ జాతకంపై జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విజయ్ జాతకం ప్రధాని నరేంద్రమోదీ జాతకానికి అచ్చుగుద్దినట్లుగా ఉందన్నారు. దీంతో భవిష్యత్తులో ఎప్పటికైనా విజయ్ భారత ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ గుజరాత్ కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వయసు 51 ఏళ్లు. ఇప్పుడు విజయ్ వయసు 51 ఏళ్లు. ప్రధాని మోదీ అంతకుముందు ఎలాంటి మంత్రి పదవులు, ఇతర పదవులు చేపట్టకుండానే నేరుగా సీఎం పీఠాన్ని అధిరోహించారు. విజయ్ కూడా అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నేరుగా సీఎం అయ్యారు.

Vijay Astrologer RickyRadhanPanditVetrivel Claims ModiVijay Share Same Horoscope Predicts PM Future

అంతేకాక రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు విజయ్ కు రాజకీయంగా పెద్ద పోటీ ఏమీ ఉండదని ఈ అంచనా పేర్కొంది. తమిళనాడు 9 వ ముఖ్యమంత్రిగా ఆయన సాగిస్తున్న పరిపాలన, అలాగే దేశ రాజకీయాల్లో ఆయన సాధించబోయే ఒక పెద్ద ప్రయాణానికి కేవలం ప్రారంభం మాత్రమేనని జ్యోతిష్యుడు పేర్కొన్నారు. ఇక జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ అంచనా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+