మహాలయ అమావాస్య నాడు ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం!

రేపు మహాలయ అమావాస్యతో పితృపక్షాలలో చివరి రోజు పూర్తవుతుంది. మహాలయ అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుంటే పెద్దలకు ఇష్టమైన పనులు చేస్తే వారి యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా అందరి పైన ఉంటుంది. పితృపక్షాలలో పితృదేవతలు భూమి మీదికి వచ్చి నివసిస్తారని వారికి శ్రాద్ధ కర్మలు చేస్తే వారు సంతోషంగా మళ్ళీ తిరిగి వెళ్తారని మనల్ని ఆశీర్వదించి మనకు సకల శుభాలను చేకూర్చి వెళతారని చెబుతారు.
.
పితృపక్షంలో ఇలా చేస్తే లక్ష్మీ దేవి ఆశీర్వాదం
పితృపక్ష కాలాన్ని పెద్దలకు ఎంతో ఇష్టమైన కాలంగా చెబుతారు ఈ 15 రోజుల కాలంలో మన పెద్దలు అన్న ప్రసాదంతో పాటు నీళ్లను తమకు ఇచ్చి తమను తమ పిల్లలందరూ స్మరించుకోవాలని కోరుతారు. ఎవరైతే ఈ పని చేస్తారో వారికి పితృదేవతల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా తప్పనిసరిగా ఉంటుంది. పితృపక్షం సమయంలో పితృ కార్యములు చేయని వారికి కష్టాలు వస్తాయని చెబుతారు.

If you do this on Mahalaya Amavasya goddess Lakshmi will give blessings

మహాలయ అమావాస్యతో పితృపక్షాలు పూర్తి
సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు అంతటి వారు కూడా పితృ కార్యక్రమాలు చేశారని, ఖచ్చితంగా పితృపక్షం సమయంలో శ్రాద్ధ తిధినాడు తర్పణాలు విడిచిపెట్టి పితృదేవతలకు సంతోషం కలిగించాలని చెబుతున్నారు. ఇక రేపు మహాలయ అమావాస్యనాడు పితృ పక్షాలు పూర్తవుతున్న నేపథ్యంలో పితృదేవతల మనసుకు సంతోషం కలిగేలాగా కర్మలను చేయాలని సూచిస్తున్నారు.

మహాలయ అమావాస్య నాడు ఇలా చెయ్యండి
యోగులైన బ్రాహ్మణులను పిలిపించి వారితో శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించడం ఒక పద్ధతి.. అయితే దర్భలలో పితృదేవతలను ఆహ్వానం చేసి శాస్త్రోక్తంగా శ్రాద్ధ కార్యం జరిపించడం మరొక విధానంగా చెబుతారు. ఇక ఈ రెండు విధానాలలో శ్రాద్ధ కర్మలు జరిపించడం కుదరని వారు స్వయం పాకం, దక్షిణను ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు.

ఇలా చేసినా పితృదేవతలు సంతోషిస్తారు
ఇక బంగారం, వెండి వంటి వాటిని కూడా దానం చేయడం మంచిదని అది కూడా చేయలేనప్పుడు సంకల్పం చెప్పుకుని అర్ఘ్యం, తర్పణాలు ఇవ్వడం మరో పద్ధతని చెబుతున్నారు. మహాలయ అమావాస్య రోజు ఇవేవీ చేయడానికి కుదరని పక్షంలో గోవుకు గ్రాసం సమర్పించి గోవుకు పితృదేవతలకు నమస్కరించటం వల్ల కూడా పితృదేవతల ఆశీర్వాదం ఉంటుందని సూచిస్తున్నారు.

పితృదేవతలు సంతోషిస్తే లక్ష్మీదేవికి సంతోషం కలిగినట్టే
ఇది కూడా చేయలేని వారు రెండు చేతులెత్తే ఆకాశం వైపు చూసి పితృదేవతలకు తాను శ్రాద్ధం పెట్టలేని కారణాన్ని చెప్పి మన్నించమని వారిని వేడుకోవడం కూడా పితృదేవతల ఆగ్రహాన్ని తగ్గేలా చేస్తుందని చెబుతున్నారు. ఏదో ఒక విధానంలో మన పూర్వీకులకు సంతృప్తిని కలిగిస్తే ఆ లక్ష్మీదేవికి కూడా సంతోషం కలుగుతుందని కచ్చితంగా పితృ దేవతలు మనకు సర్వసుఖాలను శుభాలను ఆశీర్వదించి వెళతారని చెబుతారు. కనుక రేపు రానున్న మహాలయ అమావాస్య రోజు నిర్లక్ష్యం చేయకుండా పెద్దల ఆశీర్వాదం కోసం పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+