వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు ఈ నక్షత్రాల్లో జన్మిస్తే..: ఎలా ఉంటారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

దాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆభరణ విక్రయం లేదా చౌర్యం, గౌరవ హాని, అనారోగ్యం, మూత్రరోగంగ మిగిలిన బంధువులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈ నక్షత్రానికి పుష్యం శూన్యమాసం అవుతుంది. తామస గుణం ఉంటాయి. చేసిన మేలు మరిచే చపలత్వం ఉంటుంది. అక్రమ వ్యాపారాలకు సంకోచించరు.

ఉత్తర నక్షత్రంలో జన్మిస్తే:

మొదటిపాదంలో పుట్టినవారు: కావ్యములు లేదా సాహిత్య ప్రబంధాల మీద అభిరుచి వుంటుంది. సాధువర్తన, వినయవిధేయతలు, శాస్త్రవిజ్ఞానం, సత్యవాదం, పరాక్రమం, పరిశుద్ధ హృదయం వుంటాయి. బంధుప్రియులవుతారు. రచయితలు, శాస్త్రవేత్తలు, ఏకాగ్రత, వినయం, లౌకికజ్ఞానం, దూరదృష్టి, ప్రయోజన దృక్పథం వుంటాయి.

రెండవ పాదంలో పుట్టిన వారు: చపలత్వం, లోభం, అస్థిరత్వం, అనారోగ్యం, ఆర్థిక సమస్యల వల్ల ఉన్నత స్థితికి రావడం కష్టం. నెమ్మది, సోమరితనం, ఏకాగ్రత, వినయం, లౌకికజ్ఞానం, దూరదృష్టి, ప్రయోజన దృక్పథం వుంటాయి.

If your birth Nakshatras are these..

మూడవ పాదంలో పుట్టిన వారు: కుంభ శని నవాంశ, ఉగ్రాంశలో జన్మించినవారు హాస్యనిపుణులు, విమర్శకులు, డాంబికులు, వితంవాదులు అవుతారు. గర్వం, అహంకారం అధికం, అప్పుడప్పుడు పశుప్రాయంగా ప్రవర్తిస్తారు.

నాలుగవ పాదంలో పుట్టినవారు: మీన గురు నవాంశ, శుభాంశలో జన్మించిన వారు పుత్రవంతులు, విద్యా వినయ సంపన్నులు అవుతారు. చేసిన మేలు మరువరు. ఇతరులకు ఉపకారం చేస్తుంటారు. హాస్య నిపుణులు, విమర్శకులు, దైవభీతి, ఆధ్యాత్మిక చింతన గలవారవుతారు.

స్వాతి నక్షత్రంలో జన్మిస్తే:

ఏ పాదంలో పుట్టిన పురుషులైనా స్వతంత్రులు, బుద్ధిమంతులు, ధైర్యవంతలు అవుతారు. పెద్దల పట్ల గౌరవం, నమ్రత వుంటాయి. అనేక భోగభాగ్యాలు అనుభవించగలరు. బంధువర్గాని ఇష్టులవుతారు. కీర్తి గడిస్తారు. వీరి హృదయం విశాలమైంది.

మొదటి పాదంలో పుట్టినవారు: ధన గురు నవాంశలో జన్మిస్తే ధీరత్వం, మాట నేర్పు, వక్తృత్వం, సర్వజ్ఞత వుంటాయి.

రెండవ పాదంలో పుట్టిన వారు: మకర శని నవాంశలో పుడితే ధర్మవర్తన, మూఢత్వం, ఎల్లప్పుడు రహస్యమైన పనులు నిర్వహించడంలో నైపుణ్యం, పరుల కార్యములు నిర్వహించే ఆసక్తి వుంటాయి.

మూడవ పాదంలో పుట్టినవారు: కుంభ శని నవాంశలో పుట్టినవారికి పెద్దల పట్ల గౌరవం. విధేయత, అభిమానం, మంచి నడవడి, రోషం, గర్వం, చాపల్యం సాధువర్తన వుంటాయి. సంపున్నులు కాగలలరు.

నాలుగవ పాదంలో పుట్టిన వారు: మీన గురు నవాంశలో పుట్టినవారికి రచనాశక్తి, పరిశీలనాతత్త్వం, కార్యనైపుణ్యం, ప్రదర్శన, చాపల్యం మొదలైన స్వభావాలుంటాయి.

English summary
If your birth Nakshatras those above said, the features told by Astrologer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X