కేబినెట్ భేటీ: వీరికి కొత్త పెన్షన్లు, తల్లికి వందనం నిధుల జమ ముహూర్తం..!!
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలం పూర్తి అవుతున్న వేళ.. పాలనా పరమైన అంశాల పై సమీక్షతో పాటుగా పెండింగ్ హామీల అమలు దిశగా నిర్ణయం తీసుకోనుంది. అమరావతి పైన కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అదే విధంగా తల్లికి వందనం నిధులు ఈ నెల విడుదల చేయనున్నారు. పెన్షన్ల అంశం పైనా విధి విధానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. పలు కీలక అంశాల పైన చర్చించి.. నిర్ణయం తీసు కొనే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతోంది. దీంతో.. ఈ రెండేళ్ల కాలంలో పాలనా తీరు పైన సమీక్ష చేయనున్నారు. మంత్రుల పని తీరు గురించి సీఎం వివరించే అవకాశం ఉంది. ఇక.. ఎన్నికల సమయంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ రోజు సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్న వేళ ఈ హామీ అమలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అదే విధంగా ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది తల్లికి వందనం నిధుల విడుదల కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 19న తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా అర్హుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

కీలక నిర్ణయాల పై చర్చ.. ఆమోదం
ఇక, అమరావతికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలికసదుపాయాల కల్పన తో పాటుగా ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్ఎఫ్పీకి ఏర్పాటు కు అమోదం తెలిపే అవకాశం ఉంది. సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం ఏర్పాటు పై నిర్ణయం తీసుకోనున్నారు. పీపీపీ ప్రాతిపదికన డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్సఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేలా జెయింట్ అబ్జర్వేషన్ వీల్ ను నిర్మించేందుకు కెబినెట్ అమోదం తెలపనున్నట్లు సమాచారం. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉంటే ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్క్ లు లాంటి వివిధ మౌలిక సదుపాయా ల ఏర్పాటుకు ఆమోదం తెలపే అవకాశం ఉందని తెలుస్తోంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు అమెదం తెలపనున్నారు. అధికారి క అజెండా తరువాత రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. SIR పైనా చర్చించి.. మంత్రుల కు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications