రెండు రోజుల్లో ఈ రాశులవారికి అరుదైన యోగంతో సంపదల పండుగ ప్రారంభం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేక శుభయోగాలను అనేక అశుభయోగాలను ఏర్పరుస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో వివిధ గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే యోగాలు అనేక ఫలితాలను 12 రాశుల వారికి ఇస్తున్నాయి. అక్టోబర్ 16వ తేదీన బుధవారం శని, రాహువు, శుక్రుడు, బుధుడు ఒకే సరళ రేఖ మీదికి వస్తున్నారు.
142 ఏళ్ల తర్వాత అరుదైన యోగం
దాదాపు 142 ఏళ్ల తర్వాత ఈ అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇక దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుండగా కొన్ని రాశుల వారికి మిశ్రమంగాను మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగాను పరిస్థితులు ఉండనున్నాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి నాలుగు గ్రహాలు ఒకే సరళ మీద రావడంతో ఏర్పడిన యోగం కారణంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇప్పుడు నూతన గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మేష రాశి వారు విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఈ సమయంలో వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏ పని చేసినప్పటికీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
తులారాశి
తులా రాశి వారికి శని, రాహువు, శుక్రుడు, బుధుడు ఒకేసారి సరళ రేఖ మీదికి రావడం వల్ల ఏర్పడిన యోగంతో అదృష్టం కలిసి వస్తుంది. రావనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఈ సమయంలో కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. వివాహం కాని తులా రాశి జాతకులకు ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి శని, రాహువు, శుక్రుడు, బుధుడు ఒకే సరళరేఖ మీదికి రావడం వల్ల ఏర్పడిన యోగంతో అదృష్టం కలిసి వస్తుంది. మీన రాశి వారు ఈ యోగం కారణంగా విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఏ పని చేపట్టిన ఈ సమయంలో సత్ఫలితాలను ఇస్తుంది. లాటరీలు తగిలే అవకాశం ఉంది. మీన రాశి వారికి ఈ సమయం జీవితంలోనే అత్యున్నతమైన సమయంగా మారుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications