• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇది ప్రమాదకరమైన రోజా, ఎంత వరకు నిజం?

By Pratap
|

21-డిసెంబర్-2017 రోజు ప్రమాదమనే విషయాన్ని నమ్మొద్దు.ఇది ఏ మాత్రం వాస్తవం కాదు,బయపడాల్సిన అవసరం ఎంత మాత్రాన లేదు.మన వ్యక్తి గత జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు అనేవి మనం చేసే పనులను బట్టి,మన నడవడికను బట్టి ఆధారపడి ఉంటాయి ఇది గమనించాలి.మనం గత జన్మలో చేసిన కర్మఫల ఆధారంగా జీవి ఈ భూమి మీద పుట్టినప్పుడే ఆ బ్రహ్మ మన నుదటన రాతను రాస్తాడు.

నేను రాసే రాతను నీవు చేసిన కర్మలకు ఫలితమే రాస్తాను తప్ప ఇందులో నా ప్రమేయం అంటూ ఏమి ఉండదు అని దేవుడు అంటాడు,మీ చెడు కర్మ ఫలితాన్ని దేవుడనైన నేను కూడా తప్పించలేను.దానికి ఉపాయం మాత్రం చెబుతాను.ఎవరి శ్రమను ఉచితంగా వాడుకోకుండా,ఎవరికి ఏలాంటి వాటిలోను ఋణ పడకుండా,ఆశలుపెట్టక,ఇచ్చిన మాట తప్పక ఆశాశ్వతమైన దేహాన్ని చూసి భ్రమించక ఈ సృష్టిలోని సంపదను ఎవరు తేలేదు,పోయెటప్పుడు ఏమి తీసుకుపోము అనే నగ్నసత్యాన్ని గ్రహించి "అహం బ్రహ్మాస్మి" అనే భావన చెంది సాటి వారికి నీ వంతుగా నీవే భగవంతుడనని భావించుకుని ఎంత సహాయ పడగలవో సహయ పడుతూ,అందరిలోను అన్నింటిలోను దైవాన్ని చూస్తూ చేసే సత్కార్యాలతో చెడు ఫలితాల నుండి విముక్తిని పొందవచ్చును అని ఋషులు, దైవజ్ఞులైన గురువులు చెప్పారు.

Is December 21, 2017 unlucky?

నీ నైతిక ధర్మాలు,భవ బంధాలను చక్కగా నిర్వహింస్తూ,జన్మనిచ్చిన తలిదండ్రులను ఇతర కుటుంబ వ్యవహారాలలో తప్పక నీ భాద్యత ఎంత ఉందో, అది తప్పక ఆచరిస్తూ,ప్రకృతి దైవ సంబంధమైన పూజలు తదితర మంచి కర్మల ద్వారా నీ విధి రాతను నీవే చక్కదిద్దుకోచ్చును.మంచి,చెడు అనేది మనిషి నడవడిక ప్రవర్తనను బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మరచి స్వార్ధం కోసం ధర్మవ్యతిరేకంగా నడిచావో దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు.చేతులారా అన్ని తప్పులు చేసి దేవున్ని నిందించినా,గుళ్ళు గోపురాలు, దీక్షలు,వ్రతాలు అని తీర్ధయాత్రలు చేసినా లాభం ఉండదు.అందుకే నీ నుదుటి రాత నువ్వే నీ ప్రవర్తనతో చక్కదిద్దుకునే అవకాశాన్ని మీ చేతుల్లో పెడతున్నాను అని మానవులకు దేవుడిచ్చిన సందేశం.

గత జన్మలో చేసిన మంచి చెడుకు సంబంధించిన ఫలితాల ఆధారంగా ప్రస్తుత జన్మ ఫలితాలు ఉంటాయి.ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ పూర్ణాయువును రాస్తే,ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు.దీనికి ఒక కధ ఉంది.

పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు.ఇతనికి 50 వ ఏట మరణ గండం ఉంది.ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించ గలరు అని సందిగ్ధంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు గురువే అన్నింటికి శరణ్యం అని భావించి గురువును ఆశ్రయించాడు.

ఎవరైన తెలిసి గాని తెలియక గాని గురువుని ఆశ్రయిస్తే గండాలు తొలగుతాయి.విభుముఖుడు అనే రాజు అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు దైవ నామ స్మరణ చేస్తూ, మృత్యుంజయ జపం చేసి దాన ధర్మ సత్కార్యాలు చేసి చావవలసినవాడు బ్రతికాడు.ఇక్కడ విషయం ఏమిటంటే "మననం చేసేవారిని కాపాడేది మంత్రం"అని అర్ధం అవుతుంది. జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి జాతక రిత్యా ఇతను మృత్యుగండం తప్పించు కోవడం కష్టం,కాని బ్రతికాడు ఏలా అని సందేహిస్తుంటే అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు ఇతనికి జాతక రిత్యా చావు ఉన్నప్పటికిని గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసిన ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు.

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భగవన్నామాన్నిస్మరించాలి. దేవున్ని స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలు కూడా హాని చేయకుండా కాపాడ బడతారు.పూర్ణాయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి దుశ్యాసునితో నిండు సభలోకి ఈడ్పించడం వలన చేసిన పాపానికి పరిహారంగా 60 వ ఏటనే చనిపోయాడు.కాబట్టి ఆయువు ఉన్నప్పటికిని, బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి ఫలితంగా నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చిన నేను ఏమి పాపం చేసానని, నాకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నా నుదుటి రాత ఇలా రాసాడు దేవుడు అని నిందించక నీ రాతను నీవే మార్చుకోవడానికి అవకాశం కల్పించాడు దేవుడు. ఈ సభ్య సమాజంలో మానవ సేవే మాధవ సేవ అని భావించి తలిదండ్రులను,భార్యబిడ్డలను,సోదర,సోదరీ మణులను, అత్తా మామలను,పశు పక్ష్యాదులను ప్రేమిస్తూ ,గౌరవిస్తూ దైవపూజలు,దాన ధర్మలు,ఆకలి,అవసరాలు అనేవి నీకు ఎంతో ఇతర జీవులకు అంతే అనే విషయాన్ని గ్రహించి సాటి వారి ఆకలిని తీర్చే పుణ్యాలు చేయండి,చేసిన పుణ్యఫలితం వలన తప్పక మంచి జీవితాన్నిఅనుభవిస్తారు,ఏ గ్రహం ఇబ్బంది పెట్టదు, ఎలాంటి ఇబ్బందులు రావు జైశ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

English summary
As we approach the home stretch of what seems to be a never ending year, we may have one more hurdle to overcome. "Late dawn. Early sunset. Short day. Long night." Like it or not, that's what's in the forecast for Thurs., Dec. 21, 2017, according to the website Earthsky.org. Of course, it's not just any other Thursday. This Dec. 21 marks the winter solstice, which is not only the shortest day of the year (bummer) and the official beginning of winter (double bummer) but also poised to be one of the most unlucky days of the year for every sign in the zodiac. But why is Dec. 21, 2017 unlucky?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X