కేంద్ర త్రికోణ రాజయోగంతో త్వరలోనే వీరికి జాక్ పాట్!
గ్రహాల రాకుమారుడైన బుధుడు, నీడ గ్రహమైన రాహువుల కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఆగస్ట్ నెలలో ఏర్పడుతున్న ఈ రాజయోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను, కొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది. బుధుడు ఆగస్టు 22వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో తిరోగమనంలో ఉన్న బుధుడుతో పాటు రాహువు కూడా కలవడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.
కర్కాటక రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం
రాహువు బుధుడికి త్రికోణంలో మొదటి, మూడు, ఆరు, 11వ ఇంట్లో ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. అయితే కేంద్ర త్రికోణ రాజయోగంలో రాహువు కారణంగా వ్యక్తుల జీవితాలలో ఇబ్బందులు వస్తాయి. ఈ రాజ యోగం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ రాజయోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశులవారికి జాక్ పాట్ తగులుతుంది. ఇక ఆ రాశులు ఏమిటో చూద్దాం.

కర్కాటక రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. వీరి జీవితం అనుకున్న విధంగా ఉంటుంది. జీవితంలో ఉన్న ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
సింహరాశి
కేంద్రీ త్రికోణ రాజ యోగం సింహ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. బుధుడి అనుగ్రహం కారణంగా సింహ రాశి వారు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. రాహువు ఈ రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల బుధ రాహువుల కలయిక సింహ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు తాము అనుకున్న పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు.
తులారాశి
కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా తుల రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తులా రాశి వారి జీవితంలో చోటుచేసుకున్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులు తమ కలలను సాకారం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications