జులై 28 రాశిఫలాలు.. ఈ రాశులవారికి ధనయోగం
మేష రాశి:మహాలక్ష్మి అష్టకాన్ని పఠించాలి. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.
వృషభరాశి:శత్రువులవల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. లక్ష్మీదేవిని పూజించడతోపాటు లక్ష్మీ స్తోత్రం పఠించాలి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నరఘోష ఉంది. మహిళలకు పనుల్లో చికాకు ఎదురవుతుంది.

మిథున రాశి:మధ్యాహ్నం నుంచి బాగుంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. రాజకీయ నాయకులను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం శుభాలను కలగజేస్తుంది. పంచదార, వెన్న కలిపి బాలకృష్ణుడికి నైవేద్యం పెట్టాలి.
కర్కాటక రాశి:ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు మధ్యాహ్నం నుంచి బాగుంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. విష్ణు సహస్ర నామాన్ని, లక్ష్మీ అష్టకాన్ని పఠించాలి.
సింహ రాశి:పనులు ఆలస్యమవుతాయి. ముఖ్యమైన పనులను పూర్తిచేయడానికి విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలం కాదు. మహా లక్ష్మి అష్టకాన్ని పఠించాలి. పాలతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి.
కన్యారాశి:ఈరోజు ధనలాభం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఉంది. ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. లక్ష్మీదేవిని పూజించడంతోపాటు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టడంవల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
తులా రాశి:వ్యాపారస్తులు ఆశించిన స్థాయిలో ఉండదు. రాజకీయ నాయకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడంతోపాటు బాలకృష్ణుడికి వెన్న కలిపి పెట్టాలి.
వృశ్చిక రాశి:ఖర్చులు నియంత్రించుకోవాలి. పని ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి అధికమవుతుంది. లక్ష్మీ అష్టకాన్ని, విష్ణు సహస్ర నామాన్ని పఠించాలి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడంవల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి:వ్యాపారస్తులకు బాగుంది. ఉద్యోగులు ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. పై అధికారులు మెచ్చుకుంటారు. శారీరక సౌఖ్యం కలుగుతుంది. మహా లక్ష్మీ అష్టకాన్ని పఠిస్తే మంచి ఫలితాలున్నాయి.
మకర రాశి:రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. ఏ నిర్ణయాన్ని ఆవేశంతో తీసుకోకూడదు. ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మీదేవిని పూజించాలి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టడంవల్ల శుభ ఫలితాలున్నాయి.
కుంభ రాశి:ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది. సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులకు అనుకూలం కాదు. అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించాలి. పంచాదా, వెన్న కలిపి బాలకృష్ణుడికి నైవేద్యం పెట్టాలి.
మీన రాశి:మధ్యాహ్నం నుంచి చెడు ఫలితాలు ఎదురవుతాయి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. డబ్బుకు సంబంధించిన విషయాల్లో వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు బాగోలేదు. లక్ష్మీ అష్టకాన్ని, విష్ణు సహస్ర నామాన్ని పఠించాలి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడంవల్ల శుభ ఫలితాలున్నాయి.












Click it and Unblock the Notifications