వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Karthika masam: కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకు పూజలు.. ఉసిరి దీపాలు: అసలు ఎందుకు?

|
Google Oneindia TeluguNews

కార్తీక మాసం ప్రారంభమైంది. శివ,కేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీకమాసంలో శివుడిని, విష్ణువుని విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా కార్తీకమాసంలో భక్తులు నిర్వహించే పూజలు విశేషంగా చెప్పుకోదగినది ఉసిరి చెట్టుకు పూజ.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు దేనికి?

కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు దేనికి?


కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు? ఉసిరి దీపం ఎందుకు పెడతారు? ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతంలో వనభోజనాలు ఎందుకు చేస్తారు? అన్నదానికి అనేక కారణాలు చెబుతున్నారు పండితులు. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే విష్ణువుని పూజించటంలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజాదికాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు నుండి వచ్చిన ఫలాలపై దీపాలను పెట్టి వాటిని దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని, విష్ణుమూర్తి కరుణ తమపై ఉంటుందని భక్తులు విశేషంగా భావిస్తారు. అందుకే కార్తీకమాసంలో ఉసిరిక దీపాలను పెడుతూ ఉంటారు.

ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం.. ఉసిరికి కార్తీక మాసంలో ప్రాధాన్యత వెనుక అనేక కారణాలు

ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం.. ఉసిరికి కార్తీక మాసంలో ప్రాధాన్యత వెనుక అనేక కారణాలు


అంతేకాదు ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతాలలో వనభోజనాలను కూడా చేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వభావం గా భావించి ఉసిరి చెట్టుకు పూజలు చేయడంతో పాటుగా వనభోజనాలు చేస్తారు. అయితే కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకు పూజ ఎందుకు చేయాలి అన్న అంశంలో ఆధ్యాత్మిక కోణం తో పాటు, సామాజిక కోణం కూడా ఉందని చెబుతున్నారు పండితులు. కార్తీక మాసం ప్రధానంగా చలికాలం. పగలు తక్కువగా రాత్రి ఎక్కువగా ఉండే ఈ కాలంలో మనుషులను విపరీతమైన బద్ధకం పెరుగుతుంది. చలికి ఉదయాన్నే లేవడం తగ్గుతుంది. ఇక సూర్యకాంతి శరీరంపై పడడం ఇతర కాలాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.

కార్తీక మాసంలో రోజూ ఉసిరిని తింటే మంచిది

కార్తీక మాసంలో రోజూ ఉసిరిని తింటే మంచిది


ఫలితంగా చలికాలంలో అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు చలికాలాన్ని యమ దంష్ట్ర లు బయటకు వచ్చే కాలంగా చెబుతారు. అందుకే అనారోగ్యాల బారి నుండి బయటపడి, యముడి కోరల నుండి కాపాడుకోవడం కోసం ఉసిరి ఎంతో ప్రధానమైనదని చెబుతారు. ఇక ఉసిరి చెట్టు ను ధాత్రీ చెట్టు అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ప్రతిరోజు ఉసిరిని తినడం, ఉసిరి దీపాలను వెలిగించి దానమివ్వడం, ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం చేస్తే ఆరోగ్యం గా ఉంటామని చెబుతున్నారు.

కార్తీక మాసంలో ఉసిరిని పూజించి, ఉసిరి కాయలు తింటే ఆరోగ్యం

కార్తీక మాసంలో ఉసిరిని పూజించి, ఉసిరి కాయలు తింటే ఆరోగ్యం


చాలామంది ఉసిరి చెట్టు ను పూజించి, దీపాలను పెడితే సరిపోతుందని భావిస్తారని, కానీ అలా కాదు ప్రతినిత్యం ఉసిరిని తినడం చెయ్యాలని చెబుతున్నారు. ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆధ్యాత్మిక భావనలతో పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని, ప్రతి నిత్యం ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల, దీప ధూపాలతో ఇంట్లో వేడి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరికి అంతటి ప్రాధాన్యత ఉంటుందని, జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి ఉసిరి చెట్టు స్వరూపంగా మనందరినీ రక్షిస్తారని చెబుతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
In the month of Karthikam, worshiping the amla tree and lighting amla lamps and donating them is believed to bring Vishnu Kataksha. The amla tree is considered a form of Vishnu. It is said that it is good to eat amla nuts at this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X