వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశీలో ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు.. తక్కువ ధరకే వసతి గృహాలు..

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కాలభైరవ మందిరం:- కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణ కథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఆలయ సమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాల నుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.

విశ్వనాధ మందిరం :- కాశీ విశ్వనాధ ప్రధాన ఆలయం. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగితా లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ మందిరానికి సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైటు కాశీ విశ్వనాధ వెబ్‌సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది.

విశాలాక్షిమందిరం:- కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం.

అన్నపూర్ణామందిరం:- కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం సత్రాన్ని దేవాలయ ఆద్వర్యంలో నిర్వహించ బడుచున్నది.

 Kashi Vishwanath Temple in Varanasi: Low cost lodges and famous visitng places

శాంక్తా మందిరం:- సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తా మందిరంలో పెద్ద సింహం శిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

దుర్గా మందిరం:- వారణాశిలో రెండు దుర్గా మందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గా మందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి"గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఆలయం గోపురం ఉత్తర భారత నగర శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇది వరకు నదితో సొరంగ మార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత కాలంలో మూసివేశారు. నాగ పంచమి రోజు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

సంకట మోచన్ హనుమాన్ మందిరం:- కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉంది. మధ్యయుగానికి చెందిన తులసి రామాయణం సృష్టికర్త తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు.

తులసీ మానస మందిరం:- ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణ కావ్య సంబంధిత తామ్రఫలకలు కొన్ని కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి.

భారతమాత ఆలయం:- భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మాగాంధీ చేత ప్రారంభించబడింది. ఇది పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటం ఉంది.

బిర్లా మందిరం:- కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబం వారిచే విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది.

కవళీ మాత:- తపస్సుకు మెచ్చి శివుడు వరమిచ్చాడు నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందుతారు. భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు వెళుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ పుణ్యక్షేత్ర దర్షణఫలితం మాకు ఇవ్వు తల్లి అని ప్రార్థించిన భక్తులకు కాశీ క్షేత్రాన్ని దర్శించిన పుణ్య ఫలితాన్ని తిరిగి దకించుకోవాలని విశ్వసిస్తారు, ఈ సంఘటన వెనక ఓ పురాణ కధ ఉంది కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.

గంగా హారతి :- కాశీలో ప్రతిరోజూ ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు గంగా హారతి చూడడానికి చేరుకుంటారు. ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

వసతిగృహాలు:- ఇక్కడ జంగంబాడి సత్రం ఉంది గదులు తక్కువ ధరకే ఇస్తారు, ఉచిత భోజనం వసతికూడా ఉంది. మరియు నాట్టు కోట్టై నగర సత్రం తమిళనాడు వారిచే నిర్వహించబడుచున్నది, ఇక్కడ తక్కువ డబ్బుకే గదులు దొరుకుతాయి. సత్రం చాల పరిశుభ్రంగా ఉంటుంది. ఇచ్చట తక్కువ ధరకే ఉదయం టిఫీన్, మద్యాహ్నం భోజనం, రాత్రికి టిఫీన్ లభించును. ఇది తెలుగు వారికి తమిళనాడు వారికి బాగుంటుంది. మరియు శ్రీ వాసవి అన్నపూర్న సత్రం ఉన్నది, ఇక్కడ గదులు దొరుకుతాయి, ఉచిత భోజనం మద్యాహ్నం దొరుకుతుంది. రాత్రికి టిఫన్ దొరుకుతుంది. ఇక్కడ ఆర్య వైశ్యులకు మాత్రమే ఇస్తారు. ఇవికాక ఇంకా ప్రవేట్ హోటల్స్ ఉన్నాయి. అన్నిప్రాంతాల వారికి అన్నిరకాల, ఆహారం దొరుకుతున్నది.

English summary
Kashi Vishwanath Temple significance: Important places to visit for the citizens, Bhakts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X