కేతు గోచారం: ఈ రాశులవారికి వచ్చే 8నెలలపాటు కష్టకాలం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో కేతువును నీడ గ్రహంగా చెబుతారు. కేతువును సహజంగా ఆశుభాలను సూచించే గ్రహంగా చూస్తారు. అటువంటి కేతువు గత సంవత్సరం అక్టోబర్లో కన్యా రాశిలోకి ప్రవేశించాడు. 2025 ఏప్రిల్ వరకు కన్యారాశి లోనే కేతువు ఉండనున్నాడు. కేతువు ప్రతీ 18 నెలలకు ఒకసారి రాశిని మారుస్తాడు.
కేతుగోచారం.. ఈ రాశులకు ఊహించని కష్టం
అయితే కేతు గోచారం వల్ల కొన్ని రాశుల వారికి శుభాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఉన్నాయి. కేతు గోచారం కారణంగా వచ్చే ఎనిమిది నెలలపాటు బాధలు అనుభవించే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కేతు సంచారం కారణంగా వృషభరాశి, కర్కాటక రాశి, తులా రాశి జాతకులకు ఊహించని కష్టాలు ఎదురవుతాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి కేతు గోచారం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికంగా కష్టాలు పడతారు. విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
కేతు గోచారం కారణంగా కర్కాటక రాశి వారికి కష్టాలు ఉంటాయి. వృత్తి జీవితంలోనూ ,వ్యక్తిగత జీవితంలోను సమస్యలు పెరుగుతాయి. కర్కాటక రాశి వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. కర్కాటక రాశి జాతకుల ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిరాకు, స్నేహితులతో విభేదాలు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతాయి.
తులారాశి
తులా రాశి వారికి కేతు సంచారం తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. తులా రాశి జాతకుల వ్యాపారాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమయంలో లావాదేవీలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. రానున్న ఎనిమిది నెలలు తులా రాశి జాతకులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications