2025లో వీరు ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుకొట్టి కుబేరులు అవుతారన్న కేతువు!
ఖగోళ మార్పులు మన జీవితం మీద ప్రాధాన్యత కలిగి ఉంటుంది. గ్రహాలు నక్షత్రాలలోకి, రాశులలోకి సంచారం చేయటం వలన జరిగే మార్పులు మన జీవితాలపై ప్రాధాన్యత కలిగి ఉంటున్నాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది.
2025లో కేతువు సంచారం
జ్యోతిషశాస్త్రంలో రాహు కేతువులను కీడు గ్రహాలుగాను నీడ గ్రహాలుగాను చెబుతారు. అటువంటి కేతువు సంచారం కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. కేతువు 2025 సంవత్సరంలో సింహరాశిలో సంచారం చేయబోతుంది.

మే 18న సింహరాశిలోకి కేతువు
మే 18 వ తేదీన కేతువు సింహరాశిలోకి వెళుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తెస్తుంది. మే 18 సాయంత్రం 5.08 నిమిషాలకు కేతు సంచారం జరగబోతుంది. కేతు సంచారం కారణంగా కొన్ని రాశులవారికి సంపదలను, శుభ ఫలితాలను ఇస్తుంది. దీంతో ప్రయోజనం చేకూరే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి కేతు సంచారంతో అపారమైన అవకాశాలు వస్తాయి. సింహరాశిలో కేతు సంచారం కారణంగా మేష రాశి వారి నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో వీరు సంబంధిత రంగాలలో గుర్తింపును తెచ్చుకుంటారు. ఇది మేష రాశి వారికి ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉన్న కాలం. కళా రంగంలో పనిచేసే వారికి కూడా శుభాలను చేకూర్చే సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు సింహరాశిలో కేతువు సంచారం కారణంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతారు. ఈ సమయంలో వీరు గతంలోని అడ్డంకులను అధిగమించడానికి జీవితం పైన తాజా దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి వీలు పడుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఇది శుభ సమయం.
సింహరాశి
సింహరాశి జాతకులు కేతువు సంచారం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. 2025 లో కేతువు సింహరాశిలోనే సంచరిస్తున్న కారణంగా వీరికి విజయాలు కలుగుతాయి. ఈ సమయంలో ఆర్థిక ప్రగతి కలుగుతుంది. వ్యక్తిగత వృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications