మే నెలలో సుముహూర్తాలు ఇవే..ఏకంగా 50 వేల జంటలు ఒక్కటి కానున్నాయి
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
కళ్యాణ వేళాయే మన తెలుగు రాష్ట్రాలలో సుముహూర్తాలు వచ్చేసాయి, సుమారుగా 50 వేల జంటలు ఒకటి కానున్నాయి. పెళ్ళిళ్ళకి గతేడాదితో పోలిస్తే బెటరే.. కానీ ఎండలు మాత్రం అదరగొడుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఫంక్షన్లకు అనువైన వాతావరణం నెలకొంది. ముహూర్తాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అనేక కారణాల వలన నిలిచిన వివాహాలు.. జరగబోతున్నాయి. ఈ మే నెల నుండి పెళ్లిళ్లకు బలమైన ముహుర్తాలు ఉన్నాయి. దీంతో ఎప్పటిలాగే ఫంక్షన్ల హాళ్లు బిజీ బిజీగా ఉండబోతున్నాయి. గతంలో కరోనా ఉద్రిక్తత వలన పెళ్లి ముహూర్తాల సమయంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే, దీంతో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. పెళ్లిళ్ల హడావుడి పెద్దగా లేకపోవటంతో ఆయా రంగాలకు చెందిన వారు చాలా నష్టపోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో ఎన్నో జంటలు వివాహాలకు సిద్ధమవుతున్నాయి. గత ఏప్రిల్ నెలలో పలు జంటలు పెళ్లిళ్లు చేసుకోగా మే నెల వైశాఖమాసం కాబట్టి బలమైన ముహూర్తాలు చాలా ఉన్నాయి. మే, జూన్, నెలల్లో తెలుగు రాష్ట్రాలలో సుమారు 50 వేల జంటలు ఒక్కటి కానున్నాయి. మే నెలలో 4, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 20, 21, 22, 23, 25, తేదీలు మంచి రోజులు.

ఈ ముహూర్తాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జంటలు వివాహాలు చేసుకొనేందుకు సన్నద్దం అవుతున్నాయి. కేసుల టెన్షన్ దేశంలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుంది. ఆలస్యం చేస్తే మళ్లీ కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మే నెలలో పెళ్లి తంతు పూర్తయ్యేలా ఎక్కువ మంది ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఫోర్త్ వేవ్ వచ్చే లోపు తమ వివాహాలు చేసుకోవాలని ఆయా జంటలు భావిస్తున్నాయి. ఈ మేరకు వారు షెడ్యూల్ చేసుకొని పెళ్లిళ్లు చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.












Click it and Unblock the Notifications