Lunar eclipse2022: చంద్రగ్రహణం తర్వాత 5రాశుల వారికి పట్టిందల్లా బంగారమే; ఏం చేసినా ధనయోగమే!!

నేడు చంద్ర గ్రహణం. అయితే చంద్రగ్రహణం భారతదేశంలో అనేక ప్రాంతాలలో పాక్షికంగా కనిపిస్తుంది. ఈ ఏడాది ఇదే చివరి చంద్ర గ్రహణం. చంద్రగ్రహణం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల 38 నిమిషాల నుండి ప్రారంభమై, సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు ముగుస్తుంది. భారతదేశంలో సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి 6 గంటల 18 నిమిషాల వరకు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం తర్వాత కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కనిపిస్తుంటే, మరికొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చంద్ర గ్రహణం తర్వాత ఒక రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అని, జాక్పాట్ తగులుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక మరికొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయని అంటున్నారు.

సింహరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత సానుకూల ఫలితాలు

సింహరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత సానుకూల ఫలితాలు

చంద్ర గ్రహణం తర్వాత సింహరాశి, కర్కాటక రాశి, మకర రాశి, కుంభ రాశి, తులా రాశి, మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. సింహ రాశి వారు చంద్ర గ్రహణం తర్వాత మంచి సానుకూల ఫలితాలు పొందుతారని, చంద్రుని శక్తి సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. మీ ప్రస్తుత పరిస్థితిని కూడా పరిశీలించడానికి, మిమ్మల్ని మీరు అభివృద్ధి వైపు ముందుకు నడపడానికి చంద్ర గ్రహణం తర్వాత కలిసివస్తుందని చెబుతున్నారు.

కర్కాటక రాశి వారిపై చంద్ర గ్రహణ ప్రభావం ఇలా

కర్కాటక రాశి వారిపై చంద్ర గ్రహణ ప్రభావం ఇలా


చంద్ర గ్రహణం కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని, ప్రశాంతంగా, పనులను సావధానంగా చేసుకుంటూ వెళ్లాలని అప్పుడే అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కర్కాటక రాశి వారు గ్రహణం తర్వాత నుండి చేసే పనులలో సానుకూల ఫలితాలను పొందుతారు.

చంద్రగ్రహణం తర్వాత మిథున రాశి వారికి ధనయోగం

చంద్రగ్రహణం తర్వాత మిథున రాశి వారికి ధనయోగం


ఇక ఈ చంద్రగ్రహణం తర్వాత మిధున రాశి వారికి ధనయోగం కలుగుతుందని చెబుతున్నారు. చంద్ర గ్రహణం తర్వాత నుంచి ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలలో ప్రమోషన్లు పొందవచ్చని, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. బ్యాంకింగ్, మీడియా, విద్యా రంగాలలో పనిచేసే వారికి చంద్ర గ్రహణం తర్వాత బాగా లాభిస్తుందని చెబుతున్నారు.

కుంభ రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించటానికి అనుకూల సమయం

కుంభ రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించటానికి అనుకూల సమయం


ఇక కుంభ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయని చెబుతున్నారు. మీ వృత్తి జీవితంలో కొన్ని సానుకూల మార్పులు సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.

మకర రాశి వారికి శుభం.. వాహన యోగం

మకర రాశి వారికి శుభం.. వాహన యోగం


ఈ చంద్రగ్రహణం మకర రాశిలో జన్మించిన వారికి, డిసెంబర్ 21 నుండి జనవరి 19 మధ్య జన్మించిన వారికి శుభప్రదం అవుతుంది. మీరు ఇతరుల పట్ల గౌరవంగా ఉండడంతో అది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా సూచించబడతాయి. చంద్ర గ్రహణం తర్వాత కాలం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.


disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+