Maha shivratri 2024: నేడు ఈ తప్పులు అస్సలు చేయకండి; చేస్తే శివయ్యకు ఆగ్రహం!!
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. నేడు మహాశివరాత్రి పర్వదినం.. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం పూజాదికాలను నిర్వహిస్తున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినాన శివుడిని పూజించే వారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేయకూడని తప్పులు చేస్తే శివయ్య ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
ఇక మహాశివరాత్రి పర్వదినం నాడు చేయకూడని తప్పులు ఏంటి అనేది ప్రస్తుత మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినం నాడు పొరపాటున కూడా ఎవరు నల్లని దుస్తులను ధరించకూడదు. నలుపు అజ్ఞానాన్ని సూచించే రంగు కావడంతో, ఈ రంగు పరమశివునికి అస్సలు ఇష్టం ఉండదు. మహాశివరాత్రి రోజు నల్లటి దుస్తులు ధరిస్తే వారు ప్రతికూల శక్తులతో ఆకర్షించ బడతారు. ఈ రంగు కారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించలేరు.

కనుక పొరపాటున కూడా మహాశివరాత్రి పర్వదినాన నలుపు దుస్తులు ధరించకూడదు. శివరాత్రి రోజు తెల్లని లేదా లేత రంగు దుస్తులను ధరించడం వల్ల సానుకూలత వస్తుంది. మహాశివరాత్రి పర్వదినం నాడు శివలింగానికి ప్రదక్షణలు చేయకూడదు. శివలింగం చుట్టూ తిరుగుతూ ప్రదక్షణలు చేస్తే ఆయనను ఆ స్థలానికి మాత్రమే పరిమితం చేసినట్లు అవుతుంది. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉండే పరమశివుడికి చుట్టూ తిరుగుతూ ప్రదక్షణలు చేయడం తప్పు.
ఇక మహాశివరాత్రి పర్వదినం నాడు శివుడికి తులసి ఆకులను సమర్పించకూడదు. తులసి ఆకులు విష్ణుమూర్తికి పవిత్రమైనవిగా భావిస్తారు ఇవి శివుడికి పూజకు ఉపయోగించకూడదు. ఒకవేళ తులసి ఆకులను ఉపయోగిస్తే ఆ పూజకు ఫలితం దక్కదని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించాలి. అయితే ఆ బిల్వపత్రాలు పాడైన వాటిని శివుడికి పెట్టకూడదు.
అంతేకాదు పరమశివుడికి ఎర్రటి రంగు పువ్వులను సమర్పించకూడదు. తెల్లని రంగు పువ్వులను సమర్పించవచ్చు అని చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు శివుడికి కంచు పాత్రలో పాలతో అభిషేకం చేయకూడదు. రాగి పాత్రలో పాలు శివుడికి నివేదించడం మంచిది. మహాశివరాత్రి నాడు శివుడికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications