నేడు మహా శివరాత్రి ఉపవాసం చేసేవారు ఇవి తినండి.. ఇవి అసలే తినకండి!
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే మహాశివరాత్రి పండుగ నేడు ఘనంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో శివాలయాలకు వెళ్లి అభిషేకాలు, అర్చనలు చేసి, ఓం నమశ్శివాయ అంటూ ఆ శివునికి తమ భక్తిప్రపత్తులను చాటుతున్నారు.
మహా శివరాత్రి ఉపవాసానికి అర్ధం ఇదే
అంతేకాదు శివరాత్రి పర్వదినం అనగానే ఉపవాస దీక్షలు, జాగారాలు కొనసాగుతాయి. అయితే చాలామంది ఉపవాసం చేసే వారికి ఏమి తినొచ్చు ఏమి తినకూడదు? అనేది కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. సహజంగా ఉపవాసం అంటే ఆహారం మానేయడం అని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఉపవాసం అంటే ఆహారం మానేయడం మాత్రమే కాదు మనోవాక్కాయ కర్మలలో పవిత్రతను కాపాడుకుంటూ ఆ శివుడి పట్ల తదాత్మ్య భావన వ్యక్తీకరించడం.

ఉపవాసంలోనూ రకాలు
ఉపవాసం చేసేవారు ఉపవాస వ్రతంలో రకరకాల విధానాలను పాటిస్తారు. కొంతమంది మంచినీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేస్తే, మరికొందరు పాలు, పండ్లు తీసుకుంటారు. ఇంకొందరు రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుని ఏక భుక్తం కొనసాగిస్తారు.అయితే మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండేవారు ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అనేది తెలియాలి.
ఉపవాసం ఉంటే ఏం తినొచ్చు.. ఏం తినకూడదు
పాలు, పెరుగు, మజ్జిగ, పండ్లు, పండ్లలో ముఖ్యంగా అరటి, ద్రాక్ష, దానిమ్మ, డ్రై ఫ్రూట్స్ అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి నీళ్లు, సగ్గుబియ్యం పాయసం, చిలకడ దుంపలు, తేనే వంటివి ఆహారంలో తీసుకోవచ్చు.ఇక ఉపవాసం చేసే వారు తీసుకోకూడని ఆహారాల విషయానికి వస్తే అన్నం, గోధుమలు, రాగులు వంటి ధాన్యాలను తినకూడదు.
ఇవి అసలే తినకూడదు
పప్పులు తినకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి వేసిన కూరలు తినకూడదు. మాంసాహారాన్ని తినకూడదు. కోడిగుడ్లు తినకూడదు. అధిక మసాలాలతో వండినవి, వేపుడు పదార్థాలు తినకూడదు. ఈరోజు మద్యం అసలే ముట్టుకోకూడదు. మహాశివరాత్రి పర్వదినాన తినకూడని ఆహారాలు తీసుకుంటే దోషం వచ్చి పడుతుంది కాబట్టి ఉపవాసం ఉన్నవారు ఒకవేళ ఆహారం తినాలి అనుకుంటే ఎటువంటి ఆహారం తినాలి అనేది తెలుసుకుని తినడం మంచిది.












Click it and Unblock the Notifications