వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mahalaya Amavasya: ఏది చేసినా కలిసి రావడం లేదా.. మహాలయ అమావాస్య రోజు ఇలా చేయండి..!!

|
Google Oneindia TeluguNews

మహాలయ అమావాస్య రోజు పితృదోషాలు తొలగించుటకు మానవులకు మహదావకాశం

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పితృదోషాల నుండి ఋణ విమోచనం కలిగించుకోవడానికి సులువైన మార్గం ఇది, కుటుంబ సమస్యలు, ఉద్యోగ, వ్యాపార సమస్యల నివారణకు, పెళ్ళీడుకొచ్చిన పిల్లలకు వివాహ సంబంధాలు కుదరకపోవడం, ఇంట్లో తరచూ ఎవరికో ఒకరికి ఆనారోగ్య సమస్యలు రావడం, ఆర్ధిక బాధలు, సంతానలేమి లేదా సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, కోర్టు కేసులు, ఏది చేసిన కలిసి రాకపోవడం మొదలైన అనేక సమస్యల నివారణ కొరకు మహాలయ అమావాస్య రోజు పితృదేవతల ఆరాధన చేయడం చక్కని అవకాశం. మానవులు పితృ కర్మలను శాస్త్ర విధి విధానాలతో చేయలేనివారికి, ఆచరించని వారికి అవి పితృఖర్మ దోషాలుగా వర్తించి అనేకానేక సమస్యలను సృష్టిస్తాయి.

మానవులే కాదు, మనం కొలిచే దేవతలు కూడా తమ అభీష్టాల కోసం పితృ దేవతలను ఆరాధిస్తారు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు వదలడం అత్యంత విశేషం, కొందరు తిధి ప్రకారం చేసిననూ.. ఈ మహాలయ అమావాస్య నాడు తర్పణం శ్రాద్ధం చేసి తీరాలి. ఈ రోజు స్వయం పాకం ఇవ్వాలనుకున్నవారు నాణ్యమైన బియ్యం, కూరగాయలు ఇవ్వండి, ఈ స్వయంపాకన్నీ కడు పేద బ్రాహ్మణుడికి కానీ లేదా నిరుపేదలకు కానీ, గోమాతకు కానీ ఇస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే గతించిన కుటుంబ పెద్దలకు ఇష్టమైన ఆహార పదార్ధాలను వండి వారికి నైవేద్యం పెట్టి, వాటిని ఆకలితో అలమటిస్తున్న కడుపేదలకు, అనాధాలకు, నిర్భాగ్యులకు పంచుతే చాలా మంచిది.

Mahalaya Amavasya 2022:Whom to worship on this day to get rid of several problems

మహాలయ అమావాస్య రోజు ఉదయం నుండి రాత్రి వరకు 'ప్రయాగ'లో పుణ్యనది తీరం నందు మీ తరపున బ్రాహ్మణోత్తములచే పితృ పూజ, మహనారాయణ హోమం, రుద్ర హోమం, మహాలయ తర్పణం, శ్రాద్ధకర్మ మీ పితృ దేవతలకి తర్పణాలు వదలడానికి కేవలం 2516 రూపాయలకే బ్రాహ్మణోత్తములచే జరిపించబడును. ఆర్దిక ఇబ్బందులు, సమయాభావం వలన కుటుంబ పరిస్థితి వలన శాస్త్రీయంగా శ్రాద్ధ కర్మలు చేయలేని చాలా మంది శ్రేయస్సు కోసం కొన్ని ధార్మిక సంస్థలు ఈ కార్యక్రమము చేపడుతున్నాయి. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి వంశాభివృద్ది జరుగుతుంది, పితృదేవతల అనుగ్రహం ఉంటేనే భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. మహాలయం నాడు తర్పణం శ్రాద్ధం జరుగును, మోక్ష ప్రాప్తి కొరకు మహా నారాయణ హోమం మరియు రుద్ర హోమం నిర్వహించబడును, ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించండి ~ డా. ఎం. ఎన్. ఆచార్య ~ 9440611151.

English summary
To get all good deeds on your way one needs to worship forefathers on Mahalaya Amavasya day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X