56రోజుల తర్వాత ప్రత్యక్షంగా కుజుడు.. రేపటినుండి వీరు నక్కతోక తొక్కినట్టే!
మన సృష్టి, మన జీవితాలు గ్రహాల సంచారంతో అవి సాగించే వివిధ దశలతో ముడిపడి సాగుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అటువంటి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశులు సంచారం చేయడం వల్ల ప్రతికూలమైన ప్రభావం పడితే, మరికొన్ని రాశులు సంచారం చేస్తే సానుకూలమైన ప్రభావం పడుతుంది. 56 రోజుల తర్వాత కుజుడు రాశి ప్రత్యక్ష సంచారాన్ని చేయబోతున్నాడు.
కుజుడి ప్రత్యక్ష సంచారం
ఫిబ్రవరి 24వ తేదీన కుజుడు తన గమనాన్ని మార్చుకొని ప్రత్యక్ష సంచారం చేస్తాడు. కుజుడి ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కుజుడి కారణంగా అనేక లాభాలను పొందుతున్నారు. కుజుడు ప్రత్యక్ష సంచారంతో లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి కుజుడు ప్రత్యక్ష సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. మిధున రాశి వారికి ఏ పని చేసినా సరే విజయం లభిస్తుంది.
సింహరాశి
కుజుడు ప్రత్యక్ష సంచారం సింహరాశి జాతకులకు సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి సంపాదన పెరుగుతుంది. భూములు, నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడంతో సింహ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు లభిస్తాయి.
తులారాశి
కుజుడి ప్రత్యక్ష సంచారం తులా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. విద్యార్థులకు మంచి రోజులు వస్తాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులకు ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి విజయం వరిస్తుంది. తులా రాశి జాతకులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది .ఈ సమయంలో తులా రాశి వారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications