సాష్టాంగ దండ ప్రమాణాలు స్త్రీలు చేయవచ్చా? చేయకూడదా?

Subscribe to Oneindia Telugu

మన ధర్మశాస్రాలు విజ్ఞాన శాస్రాన్ని కూడా రంగరించి సమాజ హితం కోసం అనేక నియమనిబంధనలను నిత్య జీవన విధానాల్లో ప్రవేశపెట్టాయి. సర్వాంతర్యామికి సాష్ట్రాంగ నమస్కారాలు చేసేందుకు అందరూ అరులే, కానీ. శారీరక నిర్మాణ పరంగా సున్నితత్వంగల స్త్రీలను మన ధర్మశాస్రాలు మోక్రాలి నమస్కారాలకే పరిమితం చేశాయి.

సాష్టాంగ నమస్కారమనగా సర్వాగ సమర్పణతో భక్తి ప్రపత్తులతో నమస్కరించడమే. ఐతే వంశాభివృద్ధికీ, సమాజాభివృద్ధికీ కర్తలైన ఫ్రీలకు సాష్టాంగ దండ ప్రమాణాల ద్వారా ఉదర భాగంతో సహా శరీర అంగాలకు ఎలాంటి హానీ జరగకుండా ఉండేందుకు వైజ్ఞానికాంశాన్ని కూడా జోడించి వారికీ పరిమితి విధించారు. పురుషులకు ఈ విధమైన మినహాయింపు లేదు. వారు తమ అష్టాంగాలను ఆనించి నమస్కరించాలి,

అక్షతలు ఎలా చేయాలి? ఏది శాస్త్రబద్ధం?

నిత్యం పూజలో ఉపయోగించే అక్షతలు కొందరు పసుపుతో, మరికొందరు కుంకుమతో చేస్తారు. ఆశీర్వచనానికి అక్షతలు సాక్షులు. వాటిని అనేకరకాలుగా చేస్తారు. శ్వేతాక్షతలు : తెల్లని ఈ అక్షింతలను మాసికం, తద్దినం వంటి పితృకార్యాలలో ఉపయోగిస్తారు. వీటిని నీటితో తడిపి, తర్పణాదులకు కర్తలను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తారు.
హరిద్రాక్షతలు : అలంకార ప్రియుడైన విష్ణువును అర్చించడానికి వైష్ణవ మత అనుయాయులు పసుపుతో చేసిన అక్షింతలను వాడతారు. స్వర్ణం లక్ష్మీదేవికి ప్రతీక కనుక హరిద్రాక్షతలు లక్ష్మీపూజలలో, వివాహాది శుభకార్యాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

method of saashtanga namaskar for women?

| కుంకుమాక్షతలు : ఈశ్వరునికి, అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం. కనుక కుంకుమాక్షతలను శైవ, శాక్లేయులు ఎక్కువగా ఉపయోగిస్తారు.
|పసుపు కుంకుమల్లు రెండూ కలిపి అక్షతలు చేయడం కూడా సాంప్రదాయం.
| కేసరి అక్షింతలు : ఇవి సామాన్యంగా రాఘవేంద్ర స్వామి వారి మఠంలో కనిపిస్తాయి. "కేసరి' అంటే చందనంతో కూడిన ఎరుపు రంగు. హనుమంతుడు అని అర్ధాలున్నాయి.

కాబట్టి ఈ అక్షింతల
వల్ల భయాలు తొలగి, అన్నింటా విజయం సాధిస్తామని మధ్వమతాను
యాయుల విశ్వాసం. యజ్ఞయాగాదులు, ఉద్యాపన, ప్రతిష్ణా కార్య క్రమాలలో "సర్వతో భద్ర మండలము" అనే పేరుతో అనేక రంగుల అక్షింతలు వాడతారు. శ్వేతాక్షతలు తప్ప మిగిలినవన్నీ ఆవునెయ్యి తోగానీ, నూనెతోగానీ తడుపుతారు. అక్షింతలు ఏవైనా ఆశీర్వచనానికే

జ్యేష్టమాసం"త్రిజేష్ఠ" వివాహ యోగ్యం కాదంటారు. ఎందుకని?"
శ్లో జ్యేష్టాంగనా కరతల గ్రహణం న కుర్యాశ్ర్యేష్ట
నక్షత్రస్య పురుషస్యచ శుక్రమాసే !
చేదర్ణహాని కలహప్రద మాశుసద్వజ్యేష్టాంగనా పురుష యోశ్చ పరస్పరంచి!

(ముహూర్త దర్పణం - వివాహ ప్రకరణం నుంచి) అంటే, అమ్మాయి, అబ్బాయిలు జ్యేష్ణా నక్షత్రంలో పుట్టినా లేదా, జ్యేష్ట సంతానమైనా జ్యేష్ఠ మాసంలో వారిరువురికీ వివాహం చేయరాదు. చేస్తే కలహాలు, ధననష్టం, వంటి కీడు కలుగుతుంది. కేవలం త్రిజ్యేష్ఠ మాత్రమే గాక జ్యేష్టచతుష్టయం, జ్యేష్ట పంచకమని | కూడా ఉన్నాయి.

ఇవి వున్నా జ్యేష్ఠమాసంలో వివాహం యోగ్యం కాదు. సామాన్య సూత్రంగా జ్యేష్ట సంతానానికి జ్యేష్ఠమాసం వివాహం నిషిద్ధం, అయితే వీరికి ఒక సడలింపు ఉంది. ప్రథమ గర్భ జనితులైన స్త్రీ పురుషులకు మాసాధిపతుల మిత్రత్వానుసారంగా వివాహం చేస్తే ! మంచిది.

ఏటి సూతకం (సంవత్సరీకం) లోగా గృహప్రవేశం చేసుకోవచ్చా?

ధర్మశాస్రానుసారంగా చాతుర్వర్ణాలకు నియమాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రం తప్పనిసరిగా సంవత్సరీకం వరకూ గృహప్రవేశాలూ, దైవారాధనలు కూడా నిషిద్ధమే. సంవత్సర సూతకం దాటిన తరువాతనే వీటిని నిర్వహించే అధికారం ఉంది. ద్విజేతరులకు ఈ విషయాల్లో కొంత సడలింపు ఉంది. చనిపోయిన మీ పెద్దలకు పితృపక్షంలో సంవత్సరీకం చేసే ఆచారం ఉంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు.

అలా పెద్దల్లో కలవకపోతే గృహప్రవేశం సంవత్సరీకం దాటిన తరువాతనే చేయడం శ్రేయస్కరం. తప్పనిసరి పరిస్థితి కలిగితే మీ ఆడబిడ్డలు ఎవరైనా వుంటే ఆ దంపతులు మీ వంశీకులవ్వరు కనుక వారిచేత గృహప్రవేశం చేయించి, మీ ఇంట్లో సంవత్సరీక కార్యం తరువాత ఆ నూతన గృహంలో మీరు నివసించవచ్చు. ఆ సందర్భంలో కూడా గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలు నిర్వహించుకొని మీ ఇష్టదైవ వ్రతం చేసుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains the method of Dhany saashtanga for women, in what way they have to perform
Please Wait while comments are loading...