వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి క్షణం పిల్లల ధ్యాసే .. వారి ఎదుగుదలే నిజమైన సంతృప్తి ...

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

నడిచే నారాయణుడే నాన్న,ఈ సృష్టిని పరిచయం చేసిన నాన్నకు పాదాభివందనం.అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే ఆ ప్రాణానికి ఓ రూపు ఇచ్చి వ్యక్తిగా తీర్చి దిద్దేది నాన్న. మన ప్రతి విజయంలో వెనకవుంటూ బాధ కలిగినప్పుడు,ఆపద వచ్చినప్పుడు నేనున్నాననే దీమాను ఇచ్చేది నాన్న.నాన్న గురించి వర్ణించడానికి భాష సరిపోదు అనంత రూపం నాన్న.సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావదారుడు అవుతాడు.

బిడ్డడు పాకడానికి ప్రయత్నించేటప్పుడు "మత్స్యం" అవుతాడు.

ఆటలాడే సమయానికి "కూర్మం" అవుతాడు.

కాస్తా పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వారాహుడు " అవుతాడు.

అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నరసింహుడు " అవుతాడు.

తాహతు తేలీక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు " అవుతాడు.

Narayanan is father, the father who introduced this creation

వెయ్యి కష్టాలు వచ్చిన ఆ కష్టాల్ని అలవోకగా నర్కుంటు వెళ్ళే"భార్గవుడు " అవుతాడు.

జీవితంలోని విలువైన నడక నేర్పే "రాముడు " అవుతాడు.

జీవన కురుక్షేత్ర యుద్దన్ని గెలిపించే "కృష్ణుడు " అవుతాడు.

చివరికి ఏదేమైనా నాన్నే నారాయణుడు!

మాతృదేవోభవ , పితృ దేవోభవ అన్న సంస్కృతి మనది.

FATHER

F- faithful
A- aniticpation
T- teach about future
H- honesty towards his children
E- Experience explain to his children
R- Relationship how to keep alive.

ప్రతి మనిషికి తల్లి తండ్రి ప్రధమ గురువులు.తన తల్లిని ఆడపిల్లల్లో చూసుకుంటాడు,

అందుకని తండ్రికి ఆడపిల్ల దగ్గర అవుతుంది, తండ్రి కుమారుడి విషయములో తనకన్నా గొప్పవాడిగా తీర్చిదిద్దటానికి కొద్దిగా కఠినంగా ఉంటాడు.ఎందుకంటే తను అనుభవించిన కష్టాలు బిడ్డకు రాకూడదు అంటే ఒక క్రమశిక్షణ కావాలి.

ఆర్ధిక పరిపుష్టి ఏ రకంగా అలవాటు చేసుకోవాలి తద్వారా అతను జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలి అని ఆశించే ఏ తండ్రి అయిన పైకి కఠినంగానే ప్రవర్తిస్తాడు.అతను తన పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత పిల్లలు పెరిగి పెద్దగయ్యాక తండ్రిగా పరిపక్వత చెంది తండ్రిని గురించి అవగాహన కలిగిన నాటికి తండ్రి ఉండొచ్చు,ఉండకపోవచ్చును.ఒక వేళ ఏ బిడ్డకైనా తండ్రి విలువ తెలిసే సరికి లేనట్లయితే ఆ తండ్రిని ఏ రకంగానూ గౌరవించుకోలేరు.వారి బొందిలో ప్రాణం ఉన్నప్పుడు గౌరవించ లేనప్పుడు ఆ తర్వాత పశ్చాత్తాప పడుతే లాభమేమిటి.

తలిదండ్రులు ఉన్న బిడ్డలు మీరు ఎంతో అదృష్ట వంతులుగా భావించుకొండి.వారే మీ సర్వస్వంగా భావించి తండ్రికి ,తల్లికి ఏ లోటు లేకుండా,రాకుండా ఉన్నతంగా గౌరవించండి,ఆప్యాయంగా చూసుకోండి. మీ ప్రవర్తన ,పరిచర్యల ద్వారా వారి మనస్సు సంతోష పడుతే అది ముక్కోటి దేవతలు ఒక్కటై దీవించిన పుణ్యఫలం మీకు దక్కుతుంది.

తలిదండ్రులకు ఒక ప్రత్యేకదినం ఏమిటి విడ్డురంగా ,ఇది మన సంప్రదాయం కాదు.మనల్ని కన్నవారికి ఎల్లప్పుడూ మన హృదయాలలో ప్రత్యేక స్థానమే ఉండాలి.అమ్మానాన్నలు అంటే 365 రోజులు 24 గంటలు వారిని సేవించి తరించే గౌరవ స్థానం వారిది , వారు లేకపోతే మనం లేము అనే విషయం ప్రతి బిడ్డకు గుర్తుకు రావలి.

వారికి ప్రతిరోజు సేవలు చేయండి,తలిదండ్రులను మన కన్న బిడ్డలుగా చూసుకుందాం నిరంతర శ్రమతో మనం ఇంతలా ఎదగడానికి వారు ఎన్ని త్యాగాలు చేసారో ఒకసారి గుర్తుకు తెచ్చుకుని మన మానవీయతను నిరూపించుకుని వారిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత బిడ్డలకే ఉంటుంది. దైవం అంటే ఎక్కడో, ఏ రూపంలోనే లేదు మనల్ని కన్న తలిదండ్రులే మనకు దైవాలు జై శ్రీమన్నారాయణ.

English summary
Narayanan is father, the father who introduced this creation. My mother gave birth to my life and gave me a shape. When we suffer from all our success, my dad is the one who gives me a lot of trouble when it comes to misfortune.Language is not enough to describe about me.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X