నీచభంగ రాజయోగంతో వీరికి సంపదల సునామీ ఇస్తున్న శుక్రుడు

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక నవగ్రహాలలో ముఖ్య గ్రహంగా భావించే శుక్రుడు భౌతిక సుఖాలకు, వైవాహిక జీవిత ఆనందానికి, ప్రేమకు, కీర్తికి, అందానికి, విలాసానికి కారకుడిగా చెబుతారు. ముఖ్యంగా శుక్రుడి కదలిక మారినప్పుడు భౌతిక జీవితంపైన ప్రభావం కనిపిస్తుంది.

కన్యారాశిలోకి శుక్రుడు.. అదృష్ట రాశులు
అక్టోబర్ 9వ తేదీన శుక్రుడు తన అత్యల్ప రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించి నీచ భంగ రాజ యోగాన్ని సృష్టిస్తున్నాడు. కన్యారాశిలో శుక్ర సంచారం తో ఏర్పడే నీచభంగ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వారు ఈ సమయంలో అన్ని విధాలా శుభ ఫలితాలను పొందుతారు. శుక్ర సంచారం కారణంగా అదృష్టవంతులు అయ్యే ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

nechabhang rajyoga gives luck and welath to these zodiac signs

తులారాశి
తులా రాశి జాతకులకు నీచభంగ రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు ఈ రాశిలో లగ్న గృహంలో ప్రయాణం చేస్తాడు. అందువల్ల తులారాశి జాతకుల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వీరి పని కూడా మెరుగుపడుతుంది. ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు వస్తాయి.

కుంభరాశి
కుంభరాశి జాతకులకు నీచభంగ రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో సానుకూలమైన ఇమేజ్ మీకు వస్తుంది. కొత్త ఉద్యోగాలు కోరుకునే వారికి అవకాశాలు దొరుకుతాయి. కుంభరాశి జాతకులు దేశ విదేశాలలో ప్రయాణించే అవకాశం ఉంటుంది శుభకార్యాలలో పాల్గొనే వీలుంటుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునరాశి
మిధున రాశి వారికి నీచభంగ రాజయోగం సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిథున రాశి జాతకులు ఆనందాలను అనుభవిస్తారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. చేసే పనిలో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు. ఈ సమయంలో కెరీర్ పురోగతికి కొత్త అవకాశాలు వస్తాయి. ఇది మిధున రాశి జాతకులకు అదృష్ట సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+