2026లో 'వినాశనం' ఖాయమా? ఆనాడే చెప్పిన జ్యోతిష్యుడు!
ప్రపంచమంతా 2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో శతాబ్దాల క్రితమే భవిష్యత్తును అంచనా వేసిన ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ రాసిన పద్యాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నోస్ట్రడామస్ అంచనాల ప్రకారం 2026 సంవత్సరం మానవాళికి అత్యంత కష్టతరంగా ఉండబోతోందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆయన అంచనా వేసిన ఆ భయంకరమైన పరిణామాల గురించి తెలుసుకుందాం.
మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా?
నోస్ట్రడామస్ పద్యాల ప్రకారం.. 2026 మధ్య నాటికి ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్లే అవకాశం ఉంది. జాతీయవాదం, మతపరమైన విభేదాల కారణంగా దేశాల మధ్య తీవ్ర హింస చెలరేగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చూస్తుంటే ఈ అంచనా నిజమవుతుందేమోనని జనం ఆందోళన చెందుతున్నారు.

ఆర్థిక సంక్షోభం.. కుప్పకూలనున్న అగ్రరాజ్యాలు
అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్ వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు 2026లో కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యుల జీవితం దుర్భరంగా మారుతుందని.. ఇది ప్రభుత్వాలపై తిరుగుబాటుకు దారితీస్తుందని నోస్ట్రడామస్ రాశారు.
ప్రకృతి ప్రకోపం
ప్రకృతి తన రౌద్ర రూపాన్ని చూపిస్తుందని నోస్ట్రడామస్ హెచ్చరించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు భయంకరమైన కరువుతో అల్లాడిపోతుంటే, మరికొన్ని చోట్ల ఆకస్మిక వరదలు సర్వస్వాన్ని తుడిచిపెట్టేస్తాయని ఆయన పేర్కొన్నారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీరప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.
ఏఐ నియంత్రణ
టెక్నాలజీ గురించి కూడా ఆయన ఆనాడే సూచనలు చేశారు. 2026 నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం మనకు సలహాలు ఇవ్వడమే కాకుండా, మనుషుల జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుందని సమాచారం. మనిషి ఏఐని కంట్రోల్ చేయడం మానేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులను శాసించే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆకస్మిక దాడులు, డ్రోన్ అటాక్స్
ఆయన తన పద్యాలలో 'తేనెటీగల గుంపు' వంటి పదాన్ని వాడారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది నిజమైన తేనెటీగలు కావు. పక్కా వ్యూహంతో ఆకస్మికంగా జరిగే డ్రోన్ దాడులు లేదా సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్లను ఇది సూచిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ దాడులు జరిగే అవకాశం ఉంది.
ఓ శక్తివంతమైన వ్యక్తి మరణం
2026లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఓ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి పగటిపూట ఆకస్మికంగా మరణిస్తారని నోస్ట్రడామస్ అంచనా వేశారు. ఈ ఘటన ప్రపంచ రాజకీయాల గమనాన్ని మార్చివేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆహార సంక్షోభం
గోధుమలు, ఇతర ధాన్యాల ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన ఆనాడే చెప్పారు. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలు ఈ అంచనాకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
నోస్ట్రడామస్ అంచనాలు గతంలో కొన్ని నిజమైనప్పటికీ, మరికొన్ని తప్పిపోయాయి. కాబట్టి ఈ అంచనాలను కేవలం హెచ్చరికలుగా మాత్రమే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, 2026లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications